భర్త ఇంటికి టైంకు రావాలని ఈ భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..

0
1741

సంసార జీవితంలో కలహాలు అనేవి చాలా కామన్‌. అయితే భార్య, భర్తలు సర్దుకు పోయే గుణం ఉంటే ఆ గొడవలు ఆదిలోనే అంతం అవుతాయి, కాని భర్త మరియు భార్య ఇద్దరు కూడా తగ్గేది లేదు అంటూ తపడితే సంసార జీవితం కాస్త నాశనం అవుతుంది. ప్రతి భర్త తన భార్య చెప్పినట్లుగా వినడంతో పాటు, తన భార్య మాటకు గౌరవం ఇవ్వాలి, అలాగే ప్రతి భార్య కూడా తన భర్తను గౌరవించడంతో పాటు, ఆయన గౌరవాన్ని కాపాడుతూ ఉండాలి.

ఇలా ఉన్నప్పుడు మాత్రమే సంసారం సాఫీగా సాగుతుంది. అలా కాదని నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఉంటాను అంటే అప్పుడు అందరు మహిళలు కూడా ఎమ్మాలా ప్రవర్తించాల్సి ఉంటుంది. చైనాలోని షాంఘై నగరంలోనే ఎమ్మా దంపతులు నివశిస్తూ ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా.

ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్లే ఎమ్మా భర్త సాయంత్రం ఆఫీస్‌ పూర్తి అవ్వగానే ఇంటికి వచ్చేయకుండా స్నేహితులతో పబ్‌లు, క్లబ్‌లు పార్టీలు అంటూ తిరుగుతుండేవాడు. ఆయనకు లేట్‌నైట్‌ పార్టీల్లో పరిచయం అయిన అమ్మాయిలు కూడా ఎక్కువ మందే ఉండేవారు. వారితో అక్రమ సంబంధం కూడా మొదలు పెట్టాడు.

ఆ విషయం ఎమ్మాకు తెలిసినా కూడా తెలియనట్లుగా వ్యవహరించేంది. పిల్లల ముందు భర్తతో గొడవ వద్దనుకుని ఎన్నో సార్ల రాత్రి సమయంలో అతడు వచ్చినా కూడా ఎమ్మా నోరుమూసుకుని ఉండేది. కొన్ని సార్లు తాగి వచ్చి ఎమ్మాను కొడుతూ ఉండేవాడు. భర్త చిత్రహింసలను, అతడి చెడు అలవాట్లను భరించడం ఎమ్మా వల్ల కాలేదు.

అందుకే అతడి నుండి విడిపోవాలనుకుంది. అదే విషయాన్ని అతడికి చెప్పగా ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని కోరాడు. అందుకు సరే అన్న ఎమ్మా ఒక ప్లాన్‌ వేసింది. మెయిన్‌ డోర్‌కు కార్డ్‌ లాక్‌ వేయించింది. అంటే హోటల్స్‌లో కార్డు చూపిస్తే కనుక ఓపెన్‌ అయినట్లుగా ఆ మెయిన్‌ డోర్‌ ఓపెన్‌ అవుతుంది. రాత్రి 9 గంటల సమయంలో ఎమ్మా డోర్‌ వేసేది.

9 గంటల తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా అతడికి శిక్షను విధించాలని నిర్ణయించింది. అర్థ గంట లేట్‌ అయితే 15 డాలర్లు, గంట లేట్‌ అయితే 50 డాలర్లు మరియు రెండు గంటలకు ఎక్కువ లేట్‌ అయితే 50 డాలర్లతో పాటు వారాంతంలో ఇంటి పని మొత్తం అతడు చేసేలా కండీషన్‌ పెట్టింది. ఎమ్మా కండీషన్స్‌కు భర్త ఓకే చెప్పాడు.

అప్పటి నుండి నెల రోజుల పాటు అతడు అప్పుడప్పుడు లేట్‌గా వచ్చేవాడు. ఇంటి పని చేయడం కష్టంగా ఉంటుందని అతడు లేట్‌ నైట్‌ పార్టీలకు గుడ్‌ బై చెప్పాడు. ఎప్పుడైన గంట అర్థం గంట లేట్‌గా వస్తున్నాడు తప్ప ఎప్పుడు కరెక్ట్‌ టైంకు వస్తున్నాడని ఎమ్మా సంతోషంగా చెబుతుంది.

ఈ విషయాన్ని ఎమ్మా భర్త స్నేహితుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ అయ్యింది. అయితే అయ్యింది కాని ఎమ్మా పలువురు భార్యలకు ఆదర్శంగా నిలిచిందని కొందరు నవ్వుకుంటున్నారు.