భవిష్యత్తులో గుండె పోటు వస్తుందో రాదో తెలుసుకోండి ఇలా..

0
1405

భవిష్యత్తులో గుండె పోటు వస్తుందో రాదో తెలుసుకోండి ఇలా..

మారుతున్న జీవనశైలి ఆహారపు అలవాట్లు మొదలగు వాటివలన చిన్న పెద్ద అనే తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా గుండెజబ్బుల బారిన పడుతున్నారు ప్రజలు. అయితే ఈ గుండెజబ్బులు వచ్చే ప్రమాదాన్ని ముందు పసిగట్టవచ్చు అంటున్నారు వైద్యులు. అతి పురాతనమైన టెక్నిక్ నాడీవైద్యం దీనిని ఉపయోగించి గుండె జబ్బుల సమస్యలను ముందే తెలుసుకుని సరైన సమయంలో డాక్టరు ను సంప్రదించవొచ్చు.

నాడీ పట్టుకొని మన ఆరోగ్యస్థితిని చెప్పవొచ్చు. మణికట్టువద్ద బొటనవేలు కిందిభాగంలో రెండు వేళ్లతో గట్టిగా అదిమి పట్టి నాడిని పరీక్షించాలి. అయితే విశ్రాంతి సమయంలో నాడి వేగాన్ని బట్టి గుండె స్టితిని చెప్పవొచ్చు కావున విశ్రాంతిగా ఉన్నప్పుడు 30 సెకన్స్ లలో నాడి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో లెక్కించి దాన్ని రెట్టింపు చేస్తే ఒకనిమిషానికి గుండె కొట్టుకునే వేగాన్ని తెలుసుకోవచ్చు. విశ్రాంతిసమయంలో గుండె వేగం ఎంత తక్కువగా ఉంటే శారీరక సామర్థ్యం అంత మంచిగా ఉందని అర్థం. అదే విశ్రాంతి సమయంలో గుండె వేగం ఎక్కువగా ఉంటె గుండెజబ్బుల సమస్యల ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ.

పెద్దవారు విశ్రాంతిఁగా ఉన్నప్పుడు సాధారనంగా నిమిషానికి 60 నుండి 100 సార్లు గుండె కొట్టుకుంటుంది. కాని అంతకన్నా తక్కువ 50 నుంచి 70 సార్లు కొట్టుకోవడమే మంచిది అంటున్నారు వైద్యులు. గుండెవేగం ఎక్కువగా ఉన్నవారిలో శారీరక సామర్ధ్యం తక్కువగాను రక్తపోటు బరువు రక్తంలో ప్రసరించే క్రొవ్వుల స్థాయి ఎక్కువగా ఉంటున్నట్లు పరిశోధకులు గుర్తించారు. వీరికి అకాల మరణముప్పు ఎక్కువట. ముఖ్యంగా విశ్రాంతి సమయంలో నిమిషానికి 81 నుంచి 90 సార్లు నాడి కొట్టుకుంటున్న వారిలో తీవ్రమైన గుండెపోటు ముప్పు ఎక్కువైతుందట. అలాగే 90 కంటె ఎక్కువసార్లు కొట్టుకునేవారిలో ఈ ముప్పు మూడింతలు పెరిగె అవకాశం ఉందట. ఉదయం లేవగానె నాడీపనితీరును రోజు వారంరోజులపాటు వేరువేరు సమయాల్లో పరీక్షించుకోవాలి. అలా వారంలో ఎక్కువసార్లు 80 కంటె ఎక్కువసార్లు కొట్టుకుంటుంటే వెంటనే డాక్టరు సంప్రదించటం వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

watch this video: