మగవారిలో ఈ లక్షణాలు ఉంటే మీ వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు లెక్క.

0
1128

మగవారిలో స్పెర్మ్ కౌంట్ సాధారనంగా ఒక స్థాయిలో కొన్ని కారణాల వల్ల తగ్గుతూ ఉంటుంది..అయితే ఈ సమస్యని ఎలా గుర్తుపట్టాలి వాటి లక్షణాలు ఏంటి అనే వంటి విషయాలపై అందరికి అవగాహన ఉండదు….కాని మగవారిలో కొన్ని లక్షణాలను బట్టి ఆ సమస్యనూ గుర్తించవచ్చు అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం…

మగవాళ్లు ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడం. ముఖ్యంగా ఇది సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం. ఈ సమస్యకూ పని ఒత్తిడి, మారిపోయిన లైఫ్ స్టయిల్, వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, చెడు అలవాట్లు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి తోడు హార్మోన్ల అసమతౌల్యం కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దీంతో పట్టుమని పాతికేళ్లు నిండకుండానే లైంగిక సామర్థ్యం దెబ్బతిని తద్వారా పిల్లల్ని కనలేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో.. అయితే పురుషుల్లో కనపడే కొన్ని లక్షణాలు, వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని సూచిస్తాయి.

ముఖంపై వెంట్రుకలు తక్కువగా ఉండటం : హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటడం వల్ల వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అవే హార్మోన్ల సమతుల్యత దెబ్బతినటం వల్ల ముఖం పై వెంట్రుకలు తగ్గడం మొదలవుతుంది. కాబట్టి ముఖం పై వెంట్రుకలు తక్కువగా ఉన్నా అస్సలు లేకపోయినా, ఆ వ్యక్తుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉంది అనే విషయాన్ని సూచిస్తుంది. అందుకే అటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది.లోతైన స్వరం ఆస్ట్రేలియా కు చెందిన ఒక యూనివర్సిటీ అధ్యయనాల్లో ఏ పురుషులకైతే లోతైన స్వరం ఉంటుందో అటువంటి వ్యక్తులకు వీర్యకణాల సాంద్రత తక్కువగా ఉంటుందని గుర్తించారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే, వృషణముల స్రావము (టెస్టోస్టెరాన్) పురుషుడి యొక్క స్వరం లోతుగా మారడానికి కారణం అవుతుందట. అంతేకాదు వీర్యకణాల ఉత్పత్తి పై కూడా ప్రభావం చూపుతుందని తేల్చారు.