Connect with us

Featured

మహిళలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి.. తెలుసుకోండి.

Published

on

భారతీయ సంప్రదాయాలు, ఆచారాలు అనాదిగా, భారత ప్రజల జీవన విధానంలో కలిసిపోయి ప్రయాణం చేస్తున్నాయి. ఈ సంప్రదాయాలలో, అత్యంత ముఖ్యమైనది, మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవడం. ఇది కేవలం ఆచారం కాదు, దీని వెనక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.అవేంటో చూడండి…

Advertisement

1. శరీరం చల్ల బడుతుంది
కుంకుమ బొట్టు పెట్టుకోవడం కేవలం, పెళ్ళి జరిగింది అన్న దానికి చిహ్నం మాత్రమే కాదు. కుంకుమలో మీరు మీ పాపిడిలో పెట్టుకున్నప్పుడు, మీ శరీరాన్ని చల్లబరుస్తుంది.

2. లైంగిక కోరికలను పెంచుతుంది
మహిళలు కుంకుమ పెట్టుకోవడం వలన వారిలోని లైంగిక కోరికలు పెరుగుతాయి. దాని ద్వారా త్వరగా సంతానం కలుగుతుంది. అందుకే భర్త చనిపోయిన మహిళలు కుంకుమ పెట్టుకోరు.

Advertisement

3. మెదడును ఉత్సాహంగా ఉంచుతుంది
కుంకుమలో పసుపు, నిమ్మ ఉంటాయి. వీటితి ఉన్న కుంకుమను నుదిటిమీద పెట్టుకోవడం వలన, మెదడు లోని కణాలను ప్రేరేపితం చేస్తాయి.

4. ఏకాగ్రతను పెంచుతాయి
నొసటి మీద వలయాకారంలో బొట్టు పెట్టుకోవడం వలన, ఏకాగ్రత పెరుగుతుంది. నొసటి ప్రాంతంలో అన్ని నాడులు కేంద్రీకృతం అయ్యి ఉంటాయి. అక్కడ పెట్టు కోవడం వలన మీరు చేసే పని మీద ఏకాగ్రత పెరుగుతుంది.

Advertisement

అందుకే ఓల్డ్ ఫ్యాషన్ అనుకోకుండా, అప్పుడప్పుడు నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకోడానికి ప్రయత్నించండి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Jyothi Poorvaj: కిల్లర్ గా మారిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ నటి.. గుర్తుపట్టడం కష్టమేనంటూ!

Published

on

Jyothi Poorvaj: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి జ్యోతి పూర్వజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలామంది జ్యోతి పూర్వజ్ అంటే గుర్తుపట్టక పోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో హీరోకి తల్లి క్యారెక్టర్ లో నటించి భారీగా గుర్తింపును తెచ్చుకుంది.

Advertisement

ఈ సీరియల్ తో భారీగా ఫ్యామిలీ సంపాదించుకుంది జగతి అలియాస్ జ్యోతి. ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సీరియల్స్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది.అంతేకాకుండా సీరియల్ లో సాంప్రదాయ పద్ధతిలో కనిపించే జగతి మేడం సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీ గా కూడా పేరు తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలో సీరియల్స్ తో బిజీగా ఉన్న జ్యోతి తాజాగా ఒక సినిమాను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలు చేసిన డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. అయితే డైరెక్టర్ పూర్వజ్ ఎవరో కాదు జ్యోతి భర్తనే. ప్రస్తుతం ఈ భార్యా భర్తల కాంబినేషన్ లో వస్తున్న తాజా కిల్లర్ మూవీ.

డ్రీమ్ గర్ల్..

అయితే కిల్లర్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అనౌన్స్ చేశారు. కిల్లర్ ఫ్రాంచైజీలో ఇది తొలి సినిమా అని, ఈ సినిమాకు కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ అని టైటిల్ పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన మరో పోస్టర్ ని కూడా విడుదల చేశారు టీమ్. ఇక ఇందులో జ్యోతి పూర్వజ్ ఒక అద్దం ముందు ఒక చేతిలో గొడ్డలి మరో చేతిలో కూరగాయలు పట్టుకొని ఉంది. కానీ అద్దంలో వెనుకవైపు మాత్రం రోబోలా కనిపిస్తునట్టు ఆ పోస్టర్ లో ఉంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఫోటోని చూసిన అభిమానులు జ్యోతి అంటే మొదట గుర్తుపట్టలేకపోయాము. ఇలా ఆమెను గుర్తుపట్టడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Gayatri Bhargavi: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ గాయత్రి..ర్యాష్ డ్రైవింగ్ చేసేవారంటూ!

Published

on

Gayatri Bhargavi: తాజాగా యాంకర్ నటి, గాయత్రి భార్గవి స్టార్ హీరో అయినా దుల్కర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం హీరోగా తమిళం అలాగే తెలుగు ఇతర భాషల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నారు దుల్కర్ సల్మాన్.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా దీపావళి పండుగకు లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే దాదాపు 40 కోట్ల వసూళ్లను సాధించింది. నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఈ సినిమాలో దుల్కర్ తో పాటు నటించే బ్యాంక్ ఎంప్లాయ్ రోల్ చేసింది. సినిమాలో చాలా సీన్స్ లో కనిపిస్తుంది. అయితే నేడు లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ అంతా విచ్చేసారు. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో గాయత్రీ భార్గవి మాట్లాడుతూ..

పక్కింట్లో ఉండేవారు…

దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చెన్నైలో నా పక్కింటిలో ఉండేవారు ఆయన. కుర్రాడిగా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేటప్పటి నుంచి తెలుసు అని నవ్వుతూ తెలిపింది గాయత్రి భార్గవి. అయితే ఇవాళ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది అని తెలిపింది. దీంతో గాయత్రీ భార్గవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Khaidi: ఖైదీ సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో.. ఎవరో తెలుసా?

Published

on

Khaidi: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ. ఇది ఆయన కెరియర్ లో రెండవ సినిమా అన్న విషయం తెలిసిందే. తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఖైదీ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్‌ కనకరాజ్‌ నటుడు కమల్ హాసన్‌ హీరోగా తెరకెక్కించిన విక్రమ్‌ చిత్రం ఘన విజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్‌ పాత్రలో డాన్‌గా మెరిశారు.

Advertisement

అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్‌, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య హీరోగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నె లో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్‌, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు.

ఒకే సినిమాలో అన్నతమ్ముళ్లు..

దీంతో సూర్య త్వరలోనే ఖైదీ 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని తెలిపారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కూడా వచ్చే ఏడాది ఖైదీ 2 చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందని ఒక భేటీలో తెలిపారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్‌ కనకరాజ్‌ నటుడు రజనీకాంత్‌ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే గనుక నిజం అయితే అభిమానులకు పండగే అని చెప్పాలి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!