మీ గోరు మీద ఇలాంటి గుర్తు ఉందా అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..

0
1076

ఆమె పేరు లీసా హ్యారిసన్ మానిక్యూర్ చేసుకోవాలని బ్యూటీ పార్లర్ కు వెళ్ళింది. తన బొటన వేలు మీద నల్లటి గీతని గమనించిన ఆ యువతీ అది కనబడకుండా ఏదైనా డార్క్ కలర్ నెయిల్ పోలిష్ ను వేయమని అక్కడివారిని కోరింది.అయితే దాన్ని చుసిన అక్కడి సిబ్బంది లో ఒక మహిళ అది రక్త హీనత వల్లనో మారె ఇతర కారణం వల్లనో ఏర్పడిన మచ్చ కాదని, తనకి క్యాన్సర్ సోకిందని తెలిపింది.ఆ మాట వినగానే భయాక్రాంతురాలైన ఆ యువతీ వెంటనే దగ్గరలో ఉన్న ఒక ఆసుపత్రి కి వెళ్ళింది. ఆ యువతిని పరీక్షించిన డాక్టర్లు ఆమెకు సబ్ ఉంగువల్ మెలోనిమా అనే క్యాన్సర్ సోకినట్టు నిర్ధారించారు. ఇలాంటి లక్షణం ఎవరిలో ఉన్న వెంటనే వారు వైద్యుడిని సంప్రదించాలని పేర్కొంది లీసా.