మీ మూత్రం నురగ నురగ్గా ఉంటే ఈ వీడియో తప్పక చూడండి

0
4085

మూత్రం కూడా శరీర ఆరోగ్యానికి ఓ సూచిక అని ఆరోగ్య స్పృహ కలిగిన వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు అనేక వ్యాధులను మూత్ర పరీక్ష ద్వారానే గుర్తిస్తారన్న సంగతి తెలిసిందే. మూత్రం పోసినప్పుడు స్పష్టంగా ఉంటే ఓకే.. మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం ముదురు రంగులో, దుర్వాసనతో, బుడగలతో, నురగతో ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సంకేతం.

బిజీలో ఉన్నప్పుడు, పని ఒత్తిడితో ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినపుడు బుడగలు కూడా రావొచ్చు. అలాగూ యూరినల్స్ ని కెమికల్స్ తో కడిగిన వెంటనే మూత్రానికి వెళ్లిన వారికి బుడగలు, నురగ కనిపించొచ్చు. అటువంటివి పట్టించుకోవాల్సిన పనిలేదు. కాని ఏయే సందర్భాల్లో మూత్రం నురగ రాకూడదో, వస్తే ఎటువంటి సమస్య ఉన్నట్లో కింద చూద్దాం..

మానసిక ఒత్తిడి డిప్రెషన్ లో ఉన్నవారికి మూత్రంలో నురుగ వస్తుంది. ఇలా డిహైడ్రేషన్ వల్ల కూడా రావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరుగుతాయి. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి.

గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భం కారణంగా ఊపిరితిత్తుల మీద పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీంతొ ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు.
ఆదుర్దాగా లేదా ఒత్తిడిగా ఉన్నపుడు మూత్రం నురగగా లేదా బుడగలుగా మారుతుంది. యూరిన్ లో ఉంటే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు.

మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది. షుగర్ వ్యాధి మూత్రపిండాలపై ప్రభావం చూపించి మూత్రం నురగగా వస్తుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు చెడు చేస్తుంది.
మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది.
మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు. అందుకే మూత్రంలో నురగ కంటిన్యూగా వస్తే వైద్యుణ్ణి సంప్రదిస్తే మంచిది.

మన శరీరం రకరకాల ప్రతిస్పందనల ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు ఇస్తుంటుంది. అలాంటి సూచనల్లో మూత్రం రంగు కూడా ఒకటి. సాధారణంగా మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో మూత్రం రంగు మారుతుంది. మారిన మూత్రం రంగు ఎలాంటి అనారోగ్యానికి కారణమో అవగాహన కలిగి ఉండడం అవసరం.

ఎరుపు మూత్రం ఎరుపు రంగులో ఉండడానికి కారణం మూత్రంలో రక్తం కలిసి విసర్జితమవడం. ఇది చాలా సందర్భాల్లో యూరినరీ ట్రాక్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అవుతుంది. లేదా కిడ్నీ లేదా బ్లాడర్‌లో రాళ్లు ఉండడం వల్ల లేదా యూరినరీ ట్రాక్ గాయపడడం లేదా ప్రొస్టేట్ సంబంధిత సమస్యలేమైనా కావచ్చు. చాలా అరుదుగా బ్లాడర్ లేదా కిడ్నీలో క్యాన్సర్ కూడా ఇందుకు కారణం కావచ్చు. మూత్రం ద్వారా ఎక్కువ మొత్తంలో రక్తం పోకపోవచ్చు కానీ దీన్ని సమస్యకు ఒక సూచనగా భావించవచ్చు.

నీలం మూత్రం నీలం రంగులో పసి పిల్లల్లో కనిపించే సమస్య. నవజాత శిశువుల్లో రక్తంలో ఎక్కువగా కాల్షియం ఉండడం వల్ల వారి మూత్ర విసర్జన నీలం రంగులో ఉంటుంది. దీనిని బ్లూ డైపర్ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక జన్యులోపం కారణంగా వచ్చే సమస్య. పెద్ద వారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇలాంటి లక్షణం కనిపిస్తుంది.

నలుపు కొన్ని రకాల ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల వల్ల మూత్రం నలుపు రంగులో ఉండేందుకు ఆస్కారం ఉంది. ఒక్కోసారి ఐరన్ లోపం సరిచేసేందుకు వాడే ఇంజక్షన్ల కారణంగా కూడా మూత్రం నలుపు రంగులో రావచ్చు.

జేగురు ఇది సాధారణంగా చర్మం లేదా గొంతులో ఇన్‌ఫెక్షన్ల ప్రభావం కిడ్నీ మీద పడినపుడు ఇలా జరుగుతుంది. ఇలాంటి స్థితి ఎక్కువగా పిల్లల్లో కనిపిస్తుంది. యాంటీబయాటిక్స్ వాడడం ద్వారా దీన్ని నుంచి బయటపడవచ్చు. కానీ చాలా మంది డాక్టర్లు తర్వాత కాలంలో రాబోయే క్రానిక్ కిడ్నీ డిసీజ్‌కు ఇది ఒక సూచనగా భావిస్తారు.

ముదురు పసుపు మూత్రం లేత పసుపు రంగులో ఉంటుంది. డీహైడ్రేషన్‌కు లోనైనపుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఒక్కోసారి లివర్ సమస్యలు, కామెర్ల వంటి సమస్యలున్నపుడు కూడా మూత్రం ముదురు పసుపు రంగులో రావచ్చు. కొన్ని రకాల మందులు వాడుతున్నపుడు కూడా మూత్రం పసుపు రంగులో వచ్చే ఆస్కారం ఉంటుంది.