జియో ఆఫర్ తో దేశంలో సంచనలం సృష్టించిన రిలయన్స్ కంపెనీ తాజాగా మరో సంచలన ఆఫర్ తో మన ముందుకు రాబోతుంది, అదేంటంటే త్వరలో వంట గ్యాస్ సిలిండర్ల రంగంలోకి అడుగుపెట్టనుంది.. వంట గ్యాస్ అనేది నిత్యావసర వస్తువు, ఇప్పుడు ప్రతి గృహంలో వంట గ్యాస్ తప్పనిసరిగా వాడుతున్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ మీద వంట గ్యాస్ సిలిండర్ ని అందరికి సరఫరా చేస్తున్నాయి, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా వంట గ్యాస్ సిలిండర్ లని అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చిన అవి సక్సెస్ కాలేదు.వంట గ్యాస్ సిలిండర్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ని అందించాలనే ప్లాన్ లో రిలయన్స్ కంపెనీ ఉంది, ఈ ఆఫర్ లో భాగంగా మొదట రూ.158 కే 4 కిలోల గ్యాస్ సిలిండర్ ని మార్కెట్ లోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు, ఇది సక్సెస్ అయితే మార్కెట్ లోకి డొమస్టిక్, కమర్షియల్ సిలిండర్లని కూడా తేవాలనే ప్లాన్ లో ఉంది, ఈ ఆఫర్ కనుక అమలులోకి వస్తే మరో సంచలనానికి రిలయన్స్ నాంది పలికినట్లే అవుతుంది చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here