రిసెప్షన్ కి వచ్చి పెళ్లి కూతురుని వీడు ఏం చేసాడో తెలుసా..?

0
905

తన ప్రియురాలి వివాహ రిసెప్షన్‌కు వచ్చాడో యువకుడు. అంతే కాకుండా బహుమతి ఇచ్చి మరీ వధూవరులను ఆశీర్వదించాడు. అదును చూసుకొని వధువుతో కలిసి ఉడాయించాడీ ఘనుడు.. ఆమెను ఆలయంలో వివాహం చేసుకొని సరాసరి పోలీసులను ఆశ్రయించాడు.ఈ ఘటన తమిళనాడులోని వేలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తిరువలానికి చెందిన యురేసియా(24) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

ఆమె గతంలో భెల్‌ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశన్‌(25) తో ప్రమలో పడింది.. వీరి ప్రేమను యురేసియా కుటుంబీకులు అంగీకరించలేదు. అంతే కాకుండా పొన్నైకు చెందిన యువకుడితో ఆమెకు వివాహం నిశ్చయించారు. గురువారం వేకువజామున వివాహం జరగాల్సి ఉండగా బుధవారం రాత్రి రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వెంకటేశన్‌ అదును చూసుకొని వధువుతో సహా జంప్‌ అయ్యాడు.

దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపువారు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అమ్మాయికి అప్పటికే వివాహమైనందున వెంకటేశన్ ను కిడ్నాప్ కేసు కింద అరెస్టు చేయాలని పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు తరపువారు పోలీసులను ఆశ్రయించారు. యురేసియా మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లి చేసిన తమ వారిపైనే చట్టరిత్యా చర్యలు తీసుకుని తమ ప్రేమను నిలబెట్టాలని పోలీసులను వేడుకుంటోంది. ఇప్పుడు అందరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో ఉన్నారు పోలీసులు..