రేచీకటితో బాధపడుతున్న వారికి శుభవార్త…..!

0
1116

రేచీకటి నుంచి శాశ్వతంగా విముక్తి పొందండి

మనకు కళ్లు లేకపోతే జీవితమే అంధకారం లోకి వెళ్ళిపోతుంది. కారణాలు ఏవైనా కానీ రేచీకటితో బాధపడుతున్న వారి సంఖ్య కూడా చాలా ఎక్కువే. సమతౌల్య ఆహారం తీసుకోకపోవడం, కంటి ఆరోగ్యానికి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో చాలామందిని రేచీకటి వేధిస్తోంది. పగలంతా బాగానే కనిపించే నేత్రాలు కాస్తా చీకటి అయితే చాలు కనిపించడం మానేస్తాయి. దీనికి కారణం రేచీకటి. శరీరంలో కఫం పెరిగిపోవడమే ఇందుకు కారణం. పగలు సూర్య కిరణాల వేడిమికి శరీరంలోని కఫం తగ్గిపోయి కళ్లు బాగా పని చేస్తాయి. అదే చీకటి పడుతున్న కొద్దీ వేడి తగ్గిపోవడం వల్ల కఫం పెరిగిపోయి చూపు మసకబారుతుంది.

అయితే చిన్నపాటి చిట్కాలతో రేచీకటి బాధ నుంచి విముక్తి పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణలు. జీలకర్ర చూర్ణాన్ని కండ చక్కెరలో కలిపి ఉదయం, సాయంత్రం వేళల్లో తీసుకోవడం ద్వారా రేచీకటి నుంచి కొంత వరకు ఉపశమనం పొందచ్చు. అలాగే ఉదయం, సాయంత్రం టమాటా రసం తీసుకోవడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. ఇక క్యారెట్, తాజా ఆకుకూరలు, టమాటా సూపు తాగడం వల్ల కూడా రేచీకటి నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.