దేశంలో పసిపాపలకే కాదు కనీసం పండుముసలికి కూడా భద్రత లేదన్న విషయం మరోసారి రుజువైంది. బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లో వందేళ్ల వృద్ధురాలు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన సంఘటాన జరిగింది. మీరట్‌ శివారు గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

దళిత కుటుంబానికి చెందిన ముసలావిడ వయో భారంతో కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైపోయింది. ఆదివారం ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన అంకిత్‌ పునియా(35) అనే యువకుడు దారుణాంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ముసలావిడ గట్టిగా అరవలేని స్థితిలో, ఆమె దీనంగా ఏడ్చిన ఏడుపులు,అరుపులు వినబడటంతో చుట్టు పక్కలవారు స్పందించారు. ఏం జరిగిందోననే కంగారుతో తలుపులు తెరిచిన వారికి యువకుడు చేస్తున్న అకృత్యాన్ని చూసి షాకయ్యారు. వెంటనే అతణ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఈ సంఘటానతో అసలే బలహీనంగా, నీరసించిన బాధితురాలి ఆరోగ్యస్థితి ఇంకా దిగజారింది. సోమవారం ఉదయాని కల్లా పోలీసులు ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యం అందే లోపే ఆ వృద్ధురాలు మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. పోస్ట్‌మార్టం తదనంతరం మృతురాలి శరీరభాగాలను లక్నోలోని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here