వరకట్నం కేసును బిర్యానీ కేసుగా మార్చేశారు..హ్యాట్సాఫ్ మీడియా..

0
1271

వరకట్నం కేసును బిర్యానీ కేసుగా మార్చేశారు..హ్యాట్సాఫ్ మీడియా..

మానస కి రాజేంద్ర ప్రసాద్ కి గతేడాది నవంబర్ లోనే పెళ్లయింది. అత్తవారింటి పోరు వల్ల గత కొద్ది రోజులుగా భర్తకు ఆమెకు పొసగడంలేదు. ఎప్పుడు చూసిన అదనపు కట్నం తెమ్మని వేధించే వాళ్ళు. అంతేకాక ఒకానొక రోజు కట్నం తెస్తేనే ఇంటికి రమ్మని ఆమెను ఇంటి నుండి గెంటేశారు. మానస వెళ్లి పోలీసులని ఆశ్రయించిన లాభం లేకుండా పోయింది. పోలీసులు స్పందించక పోవడంతో ఆమె తన తరుపు వాళ్ళతో భర్త ఇంటి ముందు దీక్షకి దిగింది. దీంతో స్పందించిన పోలీసులు దీక్ష విరమించుకోవాలని కోరారు. కానీ మానస తన భర్త తనని ఇంట్లోకి అనుమతిస్తేనే దీక్ష విరమిస్తానని తెగెసి చెప్పేసింది. అసలు జరిగిన ఘటన ఇది కానీ మన మీడియా వారు మాత్రం దీనిని ఎలా వక్రీకరించారో ఒక్కసారి చుడండి.

* అయనకు భార్య కంటే బిర్యానీయే ఎక్కువ

* బిర్యానీ కోసం పెళ్లాన్నే వదులుకున్న మొగుడు

* తనకు బిర్యానీ వండి పెట్టలేదని, ఏకంగా భార్యను గెంటేసిన భర్త

ఇలాంటి టైటిల్స్ పెట్టి, మన మీడియా వారందరూ స్టోరీల మీద స్టోరీలు రాసేశారు. అతను చేసిన నేరం కట్నం అడగడం. కానీ అది మర్చిపోయి బిర్యానీ అసలు పాయింట్ గా మారింది. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా చెప్పండి..? వాస్తవంగా ఇద్దరి మధ్య జరిగిన గొడవల్లో బిర్యానీ కూడా ఉంది. కానీ భర్త రోజు మందు.బిర్యానీ కావాలని డిమాండ్ చేసేవాడు. అది అసలు ఇష్యూ కాదు. సదరు మహిళను హింసించాలనే ఉద్దేశంతో, అదనపు కట్నం కోసం భర్త చేసిన పనుల్లో ఇది కూడా ఒకటి. కానీ సగం సగం తెలుసుకున్న మన తెలుగు మీడియా జనాలు, తమకి ఇష్టం వచ్చినట్టు స్టోరీలు రాసి పడేసారు. ఎంతలా అంటే, నేషనల్ మీడియా కూడా ఇదే బిర్యానీ పాయింట్ పై స్టోరీలు ప్రసారం చేసింది అంతలా..

తర్వాత కానీ పోలీసులు అసలు విషయం ఏంటి అన్నదానిపై క్లారిటీ ఇచ్చారు. “మొదటినుంచీ వారిద్దరి మధ్య పెద్దగా సఖ్యత లేదు. మా స్టేషన్ తో పాటు చాలా స్టేషన్లకు ఇరువైపులా బంధువర్గాలు తిరిగారు. కానీ వారిద్దరి మధ్య సమస్య ఇంకా మారలేదు. కానీ లోకల్ గా కొంతమంది చేసిన తప్పుడు ప్రచారం కారణంగా మన న్యూస్ ఛానెల్స్ తో పాటు నేషనల్ న్యూస్ ఛానెల్స్ కూడా బిర్యానీ పాంయింట్ ని ప్రముఖంగా ప్రచురించాయి. ఈ విషయం దేశం మొత్తం పాకిపోవడంతో, నా పై అధికారులు నాకు ఫోన్లు చేసి అసలు ఈ బిర్యానీ గొడవేంటి అని అడుగుతున్నారు. దాంతో అసలు కేసు అది కాదని, వరకట్నం కేసు అని వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పాల్సి వచ్చింది” అంటున్నాడు వరంగల్ లోని వర్ధన్నపేట ఎస్సై.

ఇప్పుడయితే ఆ ప్రబుద్ధుడిపై వరకట్న చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.