వామ్మో అంతగా ఎలా సంపాదించాడు కేవలం 5ఏళ్లలో లో 300 శాతం పెరిగిన ఆస్తులు..!
అమిత్‌షా ఆస్తులు
ఆయన దేశంలో అధికార పార్టీకి జాతీయ అధ్యక్షుడు. అవినీతి, అక్రమాలకు ఆమడ దూరంలో ఉంటానని, ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్నానని చెప్పుకుంటున్నారు. నరేంద్ర మోడీని నాడు గుజరాత్‌కు ముఖ్యమంత్రినీ, దేశానికి ప్రధానినీ చేశానంటున్నారు. ఆయనే అమిత్ షా. అవినీతి మరకలను దరి చేరనీయని నిప్పుకణికను అని దర్పాన్ని చూపే అమిత్‌షా ఆర్థికంగా బహు చిన్నవాడని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన ఆస్తులను ఐదేండ్లలో 300 శాతం పెంచుకున్నారంటే ఆశ్చర్యమేయక మానదు. మరి ఇంత భారీ ఎత్తున ఆస్తులను అమిత్‌షా పెంచు కోవడం వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యం అవినీతి, అక్రమాలేన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ఓ మీడియా సంస్థ వార్తను ప్రచురించిన కొన్ని గంటల్లోనే తొలగించడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆస్తులు 2012-2017 మధ్య కాలంలో ఏకంగా 300 శాతం పెరిగాయి. రాజ్యసభకు బీజేపీ అభ్యర్థిగా అమిత్‌షా దాఖలు చేసిన నామినేషన్‌తో ఈ విషయం స్పష్టమైంది. అమిత్‌షా చివరిసారిగా 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఆస్తులను వెల్లడించారు. గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులుగా అమిత్‌షా, కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ, బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్ నామినేషన్ దాఖలు చేశారు. అమిత్‌షా స్థిర, చర ఆస్తులు(భార్య ఆస్తులతో కలుపుకొని) ఐదేండ్ల కాలంలో 300 శాతం పెరిగాయి. 2012లో అమిత్‌షా స్థిర, చర ఆస్తులను రూ.8.54 కోట్లుగా చూపించారు. ప్రస్తుతం ఈ ఆస్తులను రూ.34.31 కోట్లుగా నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. అంతేకాక.. చరాస్తులు ఐదేండ్లలో రూ.1.9 కోట్లు నుంచి ఏకంగా రూ.19 కోట్లకు(10 రెట్లు) పెరిగాయి. స్థిరాస్తులు రూ.6.63 కోట్ల నుంచి రూ.15.30 కోట్లకు పెరిగాయి.
స్మృతీ డిగ్రీ పూర్తి చేయలేదట..
మరోవైపు స్మృతీ ఇరానీ శుక్రవారం దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో మూడేండ్ల డిగ్రీ కోర్సు పూర్తి చేయలేదని పేర్కొనడం చర్చాంశ నీయంగా మారింది. 2004లో ఢిల్లీలోని చాందీచౌక్ నుంచి లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన సమయంలో 1996లోబీఏ పూర్తి చేసినట్టు వెల్లడించారు. కాగా.. 2011 రాజ్యసభ, 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి 1994లో బీకామ్ పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పుడేమో అసలు డిగ్రీ పూర్తి కాలేదని నామినేషన్‌లో పేర్కొనడం గమనార్హం. పై విషయాలన్నింటిని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ శనివారం బహిర్గత పరిచింది.
కొన్ని గంటలకే తొలగింపు
అమిత్ షా ఆస్తులు, స్మృతీ డిగ్రీ వివరాలను ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ అహ్మదాబాద్ ఎడిషన్‌లో శనివారం ప్రచురించింది. కానీ, ప్రచురించిన కొన్ని గంటలకే ఈ సమాచారాన్ని తమ వెబ్‌సైట్ నుంచి తొలగించింది. వెబ్‌సైట్ నుంచి కథనాన్ని తొలగించడానికి గల కారణా లను మాత్రం వివరిం చలేదు. ఈ స్టోరీని ‘డీఎన్‌ఏ’ కూడా ప్రచురించి, తర్వాత వెబ్‌సైట్ నుంచి తొలగిం చింది. ఈ-పేపర్‌లో మాత్రం అందుబాటులో ఉంచిం ది. అమిత్‌షా ఆస్తుల వివరాలను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన కొద్ది సేపటికే తొలగించిన విషయాన్ని ‘ది వైర్’ వెలుగులోకి తెచ్చింది. వార్తను తొలగించడానికి కారణాలను ది వైర్ తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ తగిన వివరణ రాలేదని కూడా వెల్లడించింది.