మంటపాల్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయా? అని అనుకుని ఉండొచ్చు. ఆ మంటపంలో వినాయకుడి విగ్రహం పక్కనే అమర్చిన సీసీ కెమెరాలను మాత్రం ఆ దొంగ పట్టించుకోలేదు. అందుకే ధైర్యంగా హుండీ ఎత్తుకెళ్లాడు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. హుండీ కనిపించకపోవడంతో.. నిర్వాహకులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఈ దొంగ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఇదంతా కర్ణాటకలోని హుబ్బళ్లిలో వినాయక చవితి సందర్భంగా హుబ్బళ్లి లో పెద్ద సంఖ్యలో మంటపాలను ఏర్పాటు చేశారు. ఆయా మంటపాల్లో హుండీలను ఉంచడం సహజం. ఆ హుండీపై కన్నుపడింది ఓ దొంగకు. వేషం మార్చాడు. భుజానికి ఓ బ్యాగ్ తగిలించుకుని, స్టైల్‌గా జర్కిన్ వేసుకుని భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే హుబ్బళ్లి దాజీబాన పేటలో ఏర్పాటు చేసిన మంటపానికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో మంటపంలోకి ఒంటరిగా ప్రవేశించాడు. తనను ఎవరూ చూడట్లేదు కదా అని చుట్టూ ఒకటికి రెండు సార్లు పరికించి చూశాడు. తనను ఎవరూ గమనించట్లేదని తెలుసుకుని.. జర్కిన్‌లో హుండిని దాచి పెట్టి ఎత్తుకెళ్లాడు. అంతా సవ్యంగా సాగిందని ఆ దొంగ భావించి ఉండొచ్చు.