శంకర్ రాజమౌళి ఎవరు నం.1 విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

0
1103

శంకర్ సౌత్ సినీ పరిశ్రమలో కేర్ ఆఫ్ అడ్రెస్ ఎవరైనా ఉన్నారు ఆంటే అది శంకర్ మాత్రమే.. ఇప్పటివరకు తానూ చేసిన సినిమాలలో ఎదో ఒక కొత్తదనం మరియు భారీతనం చూపించాడు. తన సినిమాతో ప్రేక్షకులను ఆనందపరచడానికి ఏదైనా చేస్తాడు శంకర్. అందుకు ఒక చిన్న ఉదాహరణ జీన్స్ సినిమాలోని ఓ సాంగ్. 1998 లో శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా రోబోలా సైన్స్ ఫ్రిక్షన్ ఫిలిం కాదు. కేవలం రొమాంటిక్ డ్రామా ఫిలిం. అలాంటి ఈ సినిమాలో హీరో తన ప్రేయసిని 7 వన్దర్స్ తో పోల్చడాన్ని ప్రేక్షకుడికి ఒకేపాటలో 7 వింతలని చూపించాడు. దట్ ఈస్ శంకర్. సరైన టెక్నాలజీ లేని ఆరోజుల్లోనే ఈ సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో మరో సాంగ్ ని తెరకెక్కించి అందరిని ఆశ్చర్యపరిచారు శంకర్. అందుకే శంకర్ సినిమా ఆంటే నిర్మాతలు సైతం డబ్బుకు వెనకాడరు. అయితే ఈ మధ్య కాలంలో మన దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, దర్శకుడు శంకర్ ని ఓవర్ కం చేస్తున్నాడని అందరూ ఒప్పుకోవాల్సిందే.. బాహుబలి సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు రాజమౌళి. నిన్నటి వరకు సౌత్ సినిమా అంటే శంకర్ మాత్రమే కనిపించేవాడు కానీ ఇప్పుడు శంకర్ ని సైతం పక్కకు నెట్టేసి సౌత్ సినిమాకు ముఖచిత్రంగా మారాడు రాజమౌళి. ఈ నేపథ్యంలో చాలామంది శంకర్ ని తక్కువచేసి మాట్లాడడం మొదలు పెట్టేసారు. కానీ ఇప్పుడు స్వయంగా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సంచలన దర్శకుడు శంకర్ మీద తన అభిమానాన్ని గౌరవాన్ని చాటుకున్నాడు. మరింత సమాచారం కోసం క్రింది వీడియో ని చూడండి.