శృతి తప్పకుండా పాడుతున్న ఈ గానకోకికల జీవితాలు శృతి తప్పాయి

0
1355

భర్తనుంచి విడిపోయి జీవితంలో ఎదురీదుతున్న ఆ సింగర్స్ ఎవరో మీకు తెలుసా…?
వాళ్ళంతా టాలీవుడ్ లో గొప్ప సింగర్స్. ఎంతటి కష్టసాధ్యమైన పాటల్నైనా అవలీలగా పాడేసే ఆ గాయనీ మణులు .. జీవితమనే సంగీతాన్ని శృతితప్పకుండా పలికించడంలో దారుణంగా ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రాణంగా ప్రేమించిన వాళ్లకు దూరమై, తమ పిల్లలే లోకంగా బతుకుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒంటరి జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని తమ పిల్లల్లోనే కొత్త జీవితాన్ని వెతుక్కుంటున్నారు.

ఆ లిస్ట్ లో మొదట చెప్పుకోతగ్గ గాయని సునీత. అందమైన చిరునవ్వు, అంతకన్నా అందమైన వ్యక్తిత్వం, టాలీవుడ్ లో గాయనీ మణుల్లో కెల్లా అందమైన గాయని గా గుర్తింపు సునీతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి. గులాబీలో ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు అనే పాటతో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న సునీత కిరణ్ అనే ఒక మీడియా వ్యక్తిని ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరి కాపురం సవ్యంగానే సాగింది. అక్కడనుంచి సునీతను తన మాటలతో వేధించడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, ఆర్ధిక పరమైన ఇబ్బందులకు గురిచేయడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఆమె భర్త. అతడిలో మార్పు వస్తుందని తనని, పిల్లల్ని బాగా చూసుకుంటాడని నమ్ముతూ వచ్చింది ఆమె.అయినా సరే అతడిలో ఎలాంటి మార్పూ రాకపోవడంతో ఒకదశలో బాగా విసుగెత్తి, సునీత అతడికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కానీ కిరణ్ సునీతకు విడాకులివ్వడానికి నిరాకరించాడు. అందుకే సునీత తన భర్తనుంచి విడిపోయి తన పిల్లలతో ఒంటరిగా ఉంటోంది. తనపై వచ్చిన చాలా రకాల అభియోగాల్ని ఆమె తట్టుకుంటూ ఇప్పటివరుకూ నిలబడి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంది. ఇన్నీ జరుగుతున్నా,సింగర్ గా తనకెరీర్ కు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా తట్టుకోవడం నిజంగా గ్రేట్.

ఆ తర్వాత స్థానం గాయని కౌశల్యది. ఆమె సొంత ఊరు గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం. నాగార్జున సాగర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో పదో తరగతి వరకు చదివింది. మిగతా చదువంతా వివిధ చోట్ల సాగింది. గుంటూరులోని మహిళా కళాశాలలో ఇంగ్లీషు సాహిత్యంతో పాటు కర్ణాటక సంగీతంలో డిగ్రీ పొందింది. ఆ తరువాత పద్మావతి విశ్వవిద్యాలయంలోశాస్త్రీయ సంగీతంలో పీజీ చేసింది. శ్రీను వైట్ల నీకోసం సినిమాతో గాయనిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు, వృత్తిరీత్యా ఇంజనీరు అయిన బాలసుబ్రహ్మణ్యంను ఇంటర్లో ప్రేమించి పెళ్లిచేసుకుంది. వాళ్లకి ఒక బాబు కూడా. సింగర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నా కౌసల్య వైవాహిక జీవితం ఎన్నో ఒడిదుడుకులతో సాగింది. ఆమె భర్త ఆమెను ఆరేళ్లు నరకం చూపించాడు. పాటలు పాడడం మానేయాలని, సినిమాలతో సంబంధాలు తెగతెంపులు చేసుకోవాలని ..ఇంకా రకరకాలుగా కండీషన్లు పెట్టేవాడు. సింగింగ్ ఆమె ప్రాణం కాబట్టి, వాటిని ఒదులుకోలేనని ఖరాఖండిగా చెప్పింది. అయినా సరే ఆమె భర్త వేధింపులు ఆపలేదు. ఇక తప్పని సరిపరిస్థితుల్లో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా అతడి తీరు మారలేదు. అలాంటి వ్యక్తితో జీవించడం కంటే విడిపోవడమే బెటర్ అని నిర్ణయించుని తెగదెంపులు చేసుకున్నారు.2015లో భర్తనుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఆమె పాటలతో పాటు తన కొడుకే ప్రాణంగా బతుకుతోంది.

ఇక గాయని కల్పన ది కూడా అచ్చం ఇదే పరిస్థితుల్లో బతుకుతోంది. ప్రేమించి పెళ్లిచేసుకుంది . పెళ్లైన కొంత కాలం వరుకూ వాళ్లిద్దరూ బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఆమెను హింసించడం మొదలు పెట్టాడు. బలవంతంగా తన కెరీర్ ను నాశనం చేయాలని చూసాడు. చాలా మంది చెప్పేది ఏమిటి అంటే ఆయన కంటే ఈమెకు పేరు ఎక్కువగా ఉండడం తో తట్టుకోలేక ఆమెను వేధించడం మొదలు పెట్టాడని ఆయన ఒక శాడిస్ట్ అని చెప్తారు. అలాంటి భర్తను భరించడం కన్నా వదలుకోవడమే బెటరని భావించిన కల్పన భర్తనుంచి విడాకులు తీసుకుని , బిడ్డతో ఒంటరిగా బతుకుతోంది. అయినా సరే ఈమె పాటల్ని పాడడం ఒదులుకోలేదు, తన వ్యక్తిత్వాన్ని వదలుకోలేదు. రెట్టించిన ఉత్సాహంతో తన కెరీర్ ను కాపాడుకుంటూ ముందుకు సాగుతోంది. సో.. వైవాహిక జీవితమనే పోరాటంలో ఓడిపోయినా వీళ్లు ముగ్గరూ , మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ , తమ కెరీర్ ను బంగారంలా మలుచుకున్నారు.