ఓ మహిళ ఇటీవల షాపింగ్ మాల్‌కు వెళ్ళింది. అక్కడ ఆమెకు ఓ వ్యక్తి ఎదురుపడ్డాడు. అతను ఎవరో కాదు.. ఆమె మాజీ భర్త..! ఆ తర్వాత వాళ్ళు ఏదో మాట్లాడుతూ.. మాట్లాడుతూ.. గొడవ కూడా పడ్డారు. ఒకరిని ఒకరు తిట్టుకున్నారు కూడా..! కానీ ఆమె మాజీ భర్త అక్కడితో ఆగకుండా.. ఇప్పుడు నువ్వు వేసుకున్న బట్టలు కూడా నా సంపాదనతో కొన్నావే అన్నాడు. అంతే ఆమె కోపం నషాళానికి ఎక్కి. ఎవడికి కావాలి రా నీ బట్టలు నీవు తీసుకో అంటూ.. అందరూ చూస్తుండగానే ఆ బట్టలను విప్పేసింది. అతను ఆపమని చెప్పినా కూడా ఆపలేదు. బట్టలన్నీ తీసి అతని ముఖం మీద కొట్టింది. షాపింగ్ మాల్ లో ఉన్న వాళ్ళంతా ఏమి జరుగుతోందోనని అయోమయంగా చూశారు. ఆమె అలాగే నగ్నంగానే నడుచుకుంటూ లిఫ్ట్ దగ్గరకు వెళ్ళింది. ఆమె లిఫ్ట్ కోసం ఎదురుచూస్తుండగా మరికొందరు మహిళలు వచ్చి ఆమెపై కొన్ని బట్టలు కప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here