షుగర్ వ్యాధి రోగులకు శుభవార్త ,రూ.5కే షుగర్ వ్యాధి మెడిసిన్ అందరికి తెలియజేయండి.

0
1379

శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (CSIR) టైప్-2 మధుమేహ వ్యాధి చికిత్స కోసం సరికొత్త ఆయుర్వేదిక్ యాంటీ డయాబెటిక్ ఔషదం ‘బీజీఆర్-34’ ను ఐదు రూపాయలకే అందిస్తోంది. లక్నోలోని ఎన్ బీఆర్ఐ, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధిచేశాయి. కస్తూరి పసుపు, ఏగిస, తిప్పతీగ, మంజిష్ట, పొడపత్రి, మెంతులు వంటి వాటిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ ఔషధాన్ని రూపొందించారు. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచి శరీరంపై ఇతర ఔషదాల దుష్ప్రభావాలను తగ్గిస్తుందని నేషనల్ బొటానికల్ రీసెర్స్ ఇనిస్టిట్యూట్ (ఎన్బీఆర్ఐ) శాస్త్రవేత్త ఏకేఎస్ రావత్ తెలిపారు. రూ.5లకే దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు ఆయుర్వేదిక్ ఫార్మా సంస్థ సన్నద్ధమవుతోంది. ఈ మందు అందుబాటులోకి వస్తే మధుమేహం ఉన్నవారికి గొప్ప వరంగానే చెప్పుకోవాలి. అందరికీ తెలిసేలా షేర్ చేయండి.