సినిమాలు హిట్ అవ్వగానే కమీడియన్స్ కాస్త పెళ్లాల పాలిట విలన్లుగా మారారు

0
1169

సినిమాల్లో కామెడీ చేసి, భార్యలకు ట్రాజెడీ చూపించారు
ఆ ముగ్గురూ తెలుగు తెరమీద సూపర్ కమెడియన్స్. ప్రేక్షకుల్ని తమ నటనతో్ బాగానే నవ్వించారు. తమ కామెడీతో వాళ్లు కూడా బాగానే సంపాదించారు. అయితే వాళ్లు కామెడీ చేసింది తెరమీదే. వాళ్ల వైవాహిక జీవితాల్లో మాత్రం భార్యలకు చుక్కలు చూపించారు. సినిమాల్లో బిజీ గా ఉండడంతో భార్యలతో కలిసి ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోయారు. ఏవేవో గొడవలతో భార్యలతో తరుచూ గొడవలు పడుతూ , తమ కాపురాల్ని రోడ్డుమీద పెట్టుకున్నారు.

ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోదగ్గ కమెడియన్ వేణుమాధవ్. యస్వీకృష్ణారెడ్డి సాంప్రదాయంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్ కామెడియన్ గా ఒకప్పుడు బాగా బిజీగా ఉండేవాడు. వరస సినిమాలు చేస్తూ ఒకదశలో ఆయన బాగానే వెనకేసుకున్నాడు. ఇండస్ట్రీలో కూడా మంచి పేరే సంపాదించాడు. అయితే ఇంట్లో మాత్రం వేణుమాధవ్ అతడి భార్య పాలిట విలన్ అయ్యాడు. తరుచు గొడవలు పడుతూ ఉండే ఈ దంపతులిద్దరూ పరస్పరం విడాకులు కోరుతూ కోర్టు కు పిటీషన్ దాఖలు చేసారు. ఇద్దరూ అంగీకారం తెల్పడంతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విడాకులు మంజూరు చేసింది. విడాకులు తీసుకున్న సందర్భంగా భరణం కింద తన భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు మైనర్ పిల్లలకు రూ. 60లక్షలు ఇచ్చేందుకు వేణుమాధవ్ అంగీకరించారు.

తర్వాత మరో కమెడియన్ చిత్రం శ్రీను కూడా ఇదే బాటలో ట్రావెల్ చేసాడు. చిత్రం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన శ్రీను మంచి మంచి కామెడీ పాత్రలు ధరించి జనాన్ని బాగానే నవ్వించేవాడు. శ్రీనువైట్ల లాంటి డైరెక్టర్లు చిత్రం శ్రీను ను బాగా ఎంకరేజ్ చేసారు. టాలీవుడ్ లో టాప్ కమెడియన్ గా సక్సెస్ అవుతాడని అందరూ అనుకుంటూ ఉండగానే, అతడి వైవాహిక జీవితం అట్టర్ ప్లాప్ అయింది. దాదాపు 250 సినిమాల్లో మంచి మంచి కామెడీ పాత్రలు ధరించిన శ్రీను కు ఎప్పుడో పెళ్ళైంది. మరి భార్యతో ఏం గొడవలొచ్చాయో కానీ, ఆమె ఉండగానే శ్రీను ఒక నృత్యకళాకారిణి తో సంబంధం పెట్టుకున్నాడు. మొదటి భార్యకు తెలియకుండా ఆమెను రహస్యంగా వివాహంచేసుకున్నాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య అతడి నుంచి విడాకులు తీసుకొని అతడిపై కేసు పెట్టింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. దీని వల్ల అతడి సినీ కెరీర్ బాగా అప్ సెట్ అయింది.

ఇక భార్యనుంచి విడాకులు తీసుకొని ఆర్థికంగా నష్టపోబోతున్న మరో కమెడియన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. ఇతడి మీద అతడి భార్య విడాకులు కోరుతూ ఛీటింగ్ కేసు నమోదు చేసింది. పృధ్వి మీద 498, 420 సెక్షన్లు కింద కేసు నమోదైంది. తన బర్త సినిమాల్లో బిజి అయ్యి నన్ను పూర్థిగా వదిలేసాడని అతడి భార్య విడాకులకు అప్లై చేస్తూ తనకు తనకు పృధ్వి నెలకు 8 లక్షల రూపాయల భరణం ఇవ్వాలని కోరుతూ కోర్టు లో కేసు పెట్టింది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు కూడా ఇంత శాలరీ ఉండదు. అది చాలా పెద్ద మొత్తమని తన సంపాదన తో అంత పెద్ద మొత్తంఇచ్చుకోలేని కోర్టు వారికి విన్నవించుకున్నాడు. ఈ కేసు ఇంకా కోర్టులో ఉంది.

ఇక కమెడియన్ జోగినాయుడు కూడా ఈ లిస్ట్ లో ఉన్నాడు. జోగిబ్రదర్స్ లో ఒకడైన జోగినాయుడు 1995 లొ జెమినీ టివిలో పనిచేస్తుండేవాడు. అప్పుడే యాంకర్ గా కొత్తగా అడుగుపెట్టిన ఝాన్సీ ని పడగొట్టాడు. ఇద్దరూ ప్రేమించుకొని , ఇంట్లో చెప్పకుండా జెమినీ టివి ఆధ్వర్యంలో పెళ్లిచేసుకున్నారు. కొన్నాళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నారు. ఆతర్వాత నుంచి ఇద్దరి మధ్యా మనస్పర్ధలొచ్చాయి. విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఒక బిడ్డ.జోగి నాయుడు ఆర్దికంగా నిలదొక్కుకోలేక పోయిన బార్య ఝాన్సీ ని మాత్రం చాల ఇబ్బందులకి గురి చేశినట్టుగా శొషల్ మీడియలో వార్తలు వెలువడ్డాయి..

సో.. మొత్తానికి ఈ కమెడియన్లు సినిమాల్లోనే నవ్వించి, నిజజీవితంలో కేసులతో…. నవ్వడం ఎప్పుడో మరిచిపోయారు. బార్యలను వేదిస్తు నిజ జీవితంలో విలన్లుగా మారారు .