ఈ ప్లాప్ హీరోయిన్ అన్నపూర్ణ స్టూడియోస్ కి మెయిన్ పిల్లరైంది

సుప్రియా చరణ్ రెడ్డి…. ఈ పేరు వినగానే ఈమె ఎవరో అంత తొందరగా స్ట్రైక్ అవదు. పవర్ స్టార్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకొస్తుంది. అక్కినేని నాగేశ్వరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు. సుమంత్ కి అక్క. అంటే నాగార్జునకి స్వయానా మేనకోడలు. తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాత.

సుప్రియ తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ తర్వాత ఆమె అక్కినేని నాగే్శ్వరరావు సంరక్షణలోనే పెరిగింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ఆమెను హీరోయిన్ గా ఎలివేట్ చేయాలని అనుకున్నారు కానీ, ఆ ఒక్క సినిమాతోనే ఆమెది హీరోయిన్ మెటీరియల్ కాదని తేలిపోయింది. హీరోయిన్ గా నటించిన కొంత కాలానికి ఆమె చరణ్ అనే ఒక హీరోని ప్రేమించి పెళ్లిచేసుకుంది. శ్రీయా మొదటి సినిమా ఇష్టంలో హీరో అతడు. సుశాంత్ డెబ్యూ మూవీ కాళిదాస్ కు అతడే దర్శకుడు.

భర్త దర్శకుడిగా తనను తాను నిరూపించుకొనే ప్రయత్నంలో ఉండగా.. సుప్రియా అన్నపూర్ణ స్డూడియోస్ వ్యవహారాలు చూసుకునేది. ఆ స్టూడియోకి ఆమే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ . తన వ్యాపార దక్షతతో స్టూడియోకు ఓ కార్పొరెట్ లుక్కును తెచ్చేశారు. కానీ స్టూడియోలో కొందరిపై చిన్నాపెద్దా తేడా లేకుండా మాట్లాడేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి. అయితే తన ఉద్యోగంలో భాగంగానే ఆమె చాలా కఠినంగా వ్యవహరిస్తుందని ఆమెను దగ్గరనుంచి చూసినవారికి తెలిసిన సత్యం. పని విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే ఆమె మాటలను భరించలేని కొందరు తమతమ చిత్రం షూటింగులను రామోజీ ఫిలిం సిటీకి మార్చేసుకుంటున్నారట.

అంత నిజాయితీగా తన బాధ్యతను నిర్వహించే ఆమె భర్త ను కూడా కోల్పోయింది. దాంతో ఆమె ఏ మాత్రం కుంగిపోకుండా అన్నపూర్ణ స్డూడియో బిజినెస్ వ్యవహరాల్ని అతి సమర్ధవంతంగా నిర్వహిస్తూ ఆ సంస్థకి మెయిన్ పిల్లరైంది. అక్కినేని వారసుల్లో ఎవరిక్ లేని బిజినెస్ వ్య్వహారాలను చక్క బెట్టగల నేర్పరి తనం ఆమే సొంతం. నాగర్జున కూడ పలు సందర్బాల్లో సుప్రియ మాత్రమే స్టూడియో వ్యవహారాలు సరిగ్గా చూడగలదు అని చెప్పారు. ఒక పక్క తల్లిదండ్రుల్ని, భర్తని పోగొట్టుకొని తన కూతురిని సమర్దవంతగా పెంచుతు కేవలం అన్నపూర్ణ స్టూడియోస్ లో జీతానికి పనిచేస్తూ..

ఆ సంస్థని చాలా టాప్ లెవెల్లో నిలబెట్టిన ఆమె టాలీవుడ్ లో చాలా మందికి ఆదర్శంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here