ఒక‌ప్పుడు తెలుగు సినిమా హీరోల భార్య‌లు ఎలా ఉండేవాళ్లో.. ఏంచేస్తుండే వాళ్లో బ‌య‌ట ప్ర‌పంచానికి అస్స‌లు తెలిసేది కాదు. అస‌లు ఫోటో చూద్దామ‌న్నా సాద్య‌మ‌య్యేది కాదు. ఎప్పుడో ఏదో పెళ్లిల్ల లోనో.. పేరంటాల లోనే క‌నిపించీ క‌నిపించ‌న‌ట్టు క‌నిపిస్తుండే వాళ్లు ఒక‌నాటి హీరోల భార్య‌లు. స‌భ్య స‌మాజానికి సంభందం లేద‌న్న‌ట్టు వంటింటి ప‌నులు, పిల్ల‌ల పెంప‌కానికే ప‌రిమితం అయ్యే వాళ్లు.

కాని కాలం మారింది. అప్పుడున్న ప‌రిస్థితులు ఇప్పుడు లేవు. హీరోల భార్య‌లు కూడా హీరోల సంపాద‌కు రెట్టింపు సంపాదిస్తున్నారంటే ఆశ్చ‌ర్య‌ప‌డ‌క త‌ప్ప‌దు. సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోగా సెటిలై మంచి రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న క‌ధానాయ‌కుల భార్య‌లు.. భ‌ర్త సంపాద‌న మీద ఆధార ప‌డ‌కుండా స్వ‌త‌హాగా త‌మ ఆదాయ మార్గాల‌ను వారు అణ్వేషించుకుంటున్నారు.

ప్ర‌స్తుత హీరోల భార్య‌లు చాలా మంది ఇంటీరియ‌ర్ డెక‌రార్స్, బొటిక్స్., ఈవెంట్ మేనేజ్ మెంట్స్., ఫాష‌న్ డిజైనింగ్ వృత్తుల్లో ప్ర‌తిభా పాట‌వాలు ప్ర‌ద‌ర్శిస్తూ రెండూ చేతుల్తో ఎకౌంట్స్ నిండా సంపాదిస్తున్న వారు ఉన్నారు. కొంద‌రు హీరోల భార్య‌లైతే సినిమా రంగంలోనే భ‌ర్త‌ల‌కు కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ అవ‌కాశాలు కూడా కొట్టేస్తున్నారు.

వ‌రుస హిట్ల‌తో దూసుకెళ్తున్న నాని భార్య అంజ‌న ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి స్కూల్లో చేరిపోయింది. ఆర్క మీడియాలో క్రియేటివ్ డిపార్ట్ మెంట్ కి హెడ్ గా ప‌ని చేస్తూ అందరి చేత శ‌భాష్ అనిపించుకుంటుంద‌ట‌. అంజ‌న క్రియేటివీటికి త‌గ్గ‌ట్టే పారితోషికం కూడా భారీ స్థాయిలో ల‌భిస్తోంద‌ట‌. బెంగుళూరు నిఫ్ట్ లో ఫాష‌న్ డిజైనింగ్ లో శిక్ష‌ణ తీసుకున్న అంజ‌న భాహుబ‌లి సినిమాకు లో ప్ర‌భాస్, రాణా, అనుష్క తో పాటు మ‌రి కొంత మంది ఆర్టిస్టుల‌ దుస్తుల డిజైనింగ్ లో కీల‌క పాత్ర పోషించింద‌ట‌.

ఇక మరో న‌టుడు రాజీవ్ క‌న‌కాల భార్య సుమ యాంక‌రింగ్ లో త‌న‌కు తానే సాటి అన్న‌ట్టు బుల్లి తెర ప్ర‌పంచానికి మ‌హారాణిలా దూసుకుపోతోంది. ఏదో ఒక ఎంట‌ర్టెయిన్ మెంట్ టీవి ఎప్పుడు ఆన్ చేసిన సుమ క‌నిపించ‌ని సంద‌ర్బం ఉండ‌దు. టీవి చూస్తున్న స‌గ‌టు మ‌హిళ‌లు అస‌లు సుమ ఇంట్లో వంట ఎప్పుడు చేస్తుంది., పిల్ల‌ల‌ను స్కూల్ కి ఎప్పుడు రెఢీ చేస్తుంది అని స‌ర‌దాగా మాట్లాడుకునే సంద‌ర్బాలు కూడా లేక‌పోలేదు. అంతే కాదు ఎలాంటి ఆడియో ఫంక్ష‌న్లు, వంద రోజుల సెల‌బ్రేష‌న్స్ ఏదైనా మైక్ ప‌ట్టుకొని సుమ హ‌డావిడి చేయాల్సిందే.. అందుకు త‌గ్గ‌ట్టుగానే సుమ సంపాద‌న కూడా ఉంద‌నుకోండి. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో బూమ్ లో ఉన్న హీరోయిన్ క‌న్నా సుమ సంపాద‌న ఎక్కువ‌ని చెప్తే ఆశ్చ‌ర్యం వేస్తోంది. కాని అది స‌త్యం.

ఇక అల్ల‌రి న‌రేష్ భార్య విరూప కూడా ఈవెంట్ మేనేజ్ నిర్వ‌హిస్తూ కార్పోరేట్ శుభ‌కార్యాలు చేస్తుంటుంది. అందుకు లక్ష‌లు, కోట్ల‌లో టారిఫ్ ఉంటుంది. అల్ల‌రి న‌రేష్ క‌న్నా ఒక ర‌కంగా రెట్టింపు సంపాదిస్తోంది విరూప‌.

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి ఇద్దరు పిల్లల తల్లి అయినఫ్ఫటికి తన తండ్రి స్థాపించిన SCIENT Institute of Technology కంపనీ కోసం తన వంతు కృషి చేస్తూ, నియామక విబాగానికి డైరెక్టర్ గా పని చేస్తుంది, అంతే కాకుండా స్పెక్ట్రాం అనే మ్యాగ్జిన్ కి చీఫ్ ఎడిటర్ గా కూడ పని చేస్తు అల్లు అర్జున్ కి దీటుగా సంపాదిస్తుంది.. ఇది నిజంగా అల్లు కుటుంభ అబిమానులకి శుభవార్తే.

రామ్ చ‌ర‌ణ్ బార్య ఉపాసన గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అందరికి తెలిసిన విషయమే, అపోలో లో చురుకైన పాత్ర వహిస్తు మరియు సోషల్ ఆక్టివిటీస్ లో కూడ ఎంతో ఆక్టివ్ గ ఉండి సంపాదనలో భర్త రాం చరణ్ కన్నా ఎంతో ముందుంది.

ఇక ఈ మద్య అందాల రాక్షషి హీరో రాహుల్ రవీంద్రన్ తన బార్య తన కన్నా ఎక్కువ ఇన్ కం టాక్ష్ ఫైల్ చేసిందని మీడియా సాక్షిగా చెప్పాడు.

ఇవండీ మన హీరోల బార్య ల సంపాదనలు..

దీనికి సంబందించి లోతైన సమాచారం కోసం మా టీం ఇంక కృషి చేస్తుంది ఈ సారి లెక్కలతో సహ ఈ సారి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here