హీరో డా.రాజశేఖర్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం పిఎస్‌వి గరుడవేగ 126.18ఎం. పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జ్యో స్టార్ ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై ప్రవీణ్ సత్తారు దర్వకత్వంలో కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను నవంబర్ 3న విడుల చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర్ చాలా ఎమోషనల్ అయ్యారు.
నా సినిమా ‘గరుడ వేగ’ ట్రైలర్ 5 మిలియన్ వ్యూస్ వచ్చిందని చెప్పినపుడు మా మమ్మీ కూడా ఉన్నారు. ఆమె కూడా చాలా సంతోష పడ్డారు. నెక్ట్స్ డే చనిపోయారు. అంతకు ముందు రోజు వరకు నేను మేఘాల్లో తేలిపోయినంత సంతోషంగా ఉన్నాను. చాలా లాంగ్ టైమ్ తర్వాత ఈ సినిమాతో సక్సెస్ వస్తుందనే నమ్మకం ఈ సినిమాతో ఏర్పడింది… అని రాజశేఖర్ అన్నారు.
200 కోట్ల ఆస్తులు అమ్ముకున్నా ముందు నుండీ మా అమ్మకు ఉన్న పెద్ద బాధ ఒకటే. నా కొడుకు చాలా లాస్ అయిపోయాడు అని. చెన్నైలో ఉన్న చాలా బిల్డింగ్స్ అమ్మేశాను. అదంతా ఉంటే దాదాపు రూ. 200 కోట్ల ఆస్తి ఉండేది. కానీ రాంగ్ టైమ్ లో రాంగ్ సినిమాలు చేయడం, నాకు సూట్ కాని సినిమాలు చాలా చేసి నష్టపోయాను. తమిళంలో సూదు కవ్వం అనే సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. ఆ సినిమా తెలుగులో చేద్దామని చేసి ఆరేడు కోట్లు పోగొట్టుకున్నాను. ఇలా చాలా డబ్బులు పోయాయి…. అని రాజశేఖర్ అన్నారు.