హీరో వెంకీ తన బార్య గురించి అందుకే ఎక్కడ చెప్పడట బయటకు కూడ రానివ్వడట పాపం..

0
1519

మనం అభిమానించే హీరో గురించి, వారి ఫ్యామిలీ ఎవరు ఏంటి అని ఇలా  ప్రతి ఒక్కటీ తెలుసుకుంటాం. మన టాలీవుడ్ లో టాప్ హీరోలుగా అలరిస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున ఈ స్టార్ హీరోలు డైలీ లైఫ్, వారి ఫ్యామిలీ, పిల్లలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అయితే వారితో పాటు టాప్ స్టార్ హీరోగా అలరిస్తున్న విక్టరీ వెంకటేష్ గురించి తప్ప, వెంకటేష్ భార్య, పిల్లలు గురించి ఎలాంటి విషయాలు ఎవ్వరికీ తెలీవు. తెలుగు  సినీ ఇండ‌స్ట్రీలో కుటుంబ క‌థా చిత్రాల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన విక్ట‌రీ వెంక‌టేష్ నిర్మాత తనయులలో స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ఒకే ఒక్క టాలీవుడ్ హీరో. వెంకటేష్ తర్వాత చాలా మంది నిర్మాతల తనయులు హీరోలుగా వచ్చినా.. వాళ్లెవ్వరు వెంకటేష్ స్తాయిలో నిలబడలేకపోయారు. ఇక రియల్ లైఫ్ లోను వెంకటేష్ చాలా సింపుల్ గా ఉండే మనస్తత్వం. అతిగా మాట్లాడటం కాని.. అనవసరపు వివాదాల్లోకి వెళ్లడం వెంకటేష్ హిస్టరీలోనే లేదు. వెంకటేష్ జీవితం.. కెరీర్ ఇంత సాఫీగా సాగడానికి కారణం అయన తండ్రి ఒక కారణం అయితే  మ‌రో కార‌ణం అయన జీవిత భాగస్వామి అయిన భార్య నీరజ కూడా ఒక కారణం.

ఎన్న‌డూ బయట కనిపించని నీరజ కూడా చాల సింపుల్ గా ఉంటారు. ఈ విషయాలు ఎలా ఉన్న వెంకటేష్ భార్య గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. చౌదరి సామజిక వర్గానికి చెందిన వెంకటేష్ భార్య నీరజ.. రెడ్డి కుటుంబం నుంచి వచ్చారు. చిత్తూరు జిల్లా గంగవరపు సుబ్బారెడ్డి కుమార్తె నీరజ రెడ్డి ని రామానాయుడికి చూపించడం, ఆయనతోపాటు వెంకటేష్ కి కూడా ఆమెను చూపించడం, దాంతో నీరజ రెడ్డికి కూడా వెంకటేష్ నచ్చడంతో వారి పెళ్లి అంగరంగ వైభోవంగా జరిగింది. వెంకటేష్ జీవితంలో అడుగుపెట్టిన నీరజ ఆయన లైఫ్ కెరీర్ సక్సస్ ఫుల్ గా సాగడంలో ప్రత్యేక  పాత్ర పోషించారు. వెంకటేష్ నీరజ లకి మొత్తం నలుగురు సంతానం. వారిలో ముగ్గుర‌ అమ్మాయిలు.. ఒక అబ్బాయి . నీరజ వెంకటేష్ ల కూతుర్ల పేర్లు ఆశ్రిత‌, హ‌య‌వాహిని, భావ‌న కాగా  కొడుకు పేరు అర్జున్ రామ్‌నాథ్ ద‌గ్గుబాటి ఇంట్లో పిల్లకి అవసరం అయ్యే ప్రతి పని నీరజ గారే దగ్గర ఉంది మరి చూసుకుంటారు . వెంకటేష్ తన భార్యను, పిల్లలను ఎప్పుడూ సినిమా ఫంక్షన్ లకు గానీ, బయటజరిగే ప్రోగ్రామ్స్ కు గానీ తన ఫ్యామిలీని తీసుకురాడు. వెంకటేష్ కొడుకు అర్జున్ తప్ప, వెంకటేష్ పిల్లలెవరూ ఏ కార్యక్రమంలోనూ మనకు కనిపించరు.  నీరజ ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పెళ్లి లో కనపడ్డారు. నీరజ కి వెంకటేష్ అంటే ఎంత ఇష్టం అంటే వెంకీ షూటింగ్ వెళ్ళే ప్రతి రోజు దేవుడు హరితి ఇచ్చి కార్ కి తను ఎదురువచ్చి మరి వెళ్తుంది . నీరజ ఎంబీఏ ని అమెరికాలో చదివారు. ఈవిడ వెంకటేష్ కి కరెక్ట్ జోడి అంటారు ఫ్యాన్స్. ఇది మన విక్టరీ లైఫ్ స్టోరీ.