10 రూపాయల నాణెం తీసుకోలేదు అని వ్యాపారిని అరెస్ట్ చేపించిన సామాన్య వ్యక్తీ

0
789

10 రూపాయల నాణెం వద్దన్నాడని.

రూ.10 నాణేలు చెల్లుతాయనీ.. ఎలాంటి అభ్యంతరం లేకుండా వాటిని ఉపయోగించుకోవచ్చని అర్బీఐ ఎంత మొత్తుకుంటున్నా వినని వారికి ఈ వార్త నిజంగా హెచ్చరికలాంటిదే. పది రూపాయల నాణెం తీసుకోనంటూ మొండికేసిన ఓ షాపు యజమానిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మొరీనా జిల్లాలోని మౌరాలో శుక్రవారం చోటుచేసుకుందీ సంఘటన. చేతి రుమాలు కొనేందుకు వినియోగదారుడు రెండు పది రూపాయల కాయిన్లు ఇవ్వబోగా.. వాటిని తీసుకునేందుకు షాపు యజమాని అంగీకరించలేదు.

దీంతో ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వ్యాపారిపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారి ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఈ చట్టం కింద నిందితులుగా తేలితే ఆరు నెలల కారాగార శిక్ష పడుతుంది. పది రూపాయల కాయిన్లు తీసుకునేందుకు వ్యాపారులు తిరస్కరిస్తున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడంతో… ఇది భారత కరెన్సీని అవమానించడమేనని పేర్కొంటూ మొరీనా కలెక్టర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.