Actor Ramachandra : సినిమాల్లో కమెడియన్ గానూ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ వందకు పైగా సినిమాల్లో నటించి మంచి పేరు గుర్తింపు అందుకున్న నటుడు రామచంద్ర ఈ మధ్య కాలంలో వెనకబడ్డాడు. వెంకీ సినిమాలో హీరో ఫ్రెండ్ గా చేసిన రామచంద్ర ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఆయన 2016 నుండి కనిపించకపోవడానికి కారణాలను చెబుతూ అలాగే తన సినిమా కెరీర్ ఎలా మొదలయింది వంటి ఆసక్తికర విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

రవితేజ అలా ఉంటాడని అనుకోలేదు…
రామచంద్ర గారు నిన్నుచూడాలని సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టి ఆపైన వెంటనే ఆనందం సినిమాలో హీరో ఫ్రెండ్స్ లో ఒకరిగా చేసారు. ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఆ తరువాత వెంటనే రవితేజ వెంకీ సినిమాలో ఛాన్స్ కొట్టేసాడు. సినిమాలో పాటలు ఫైట్ సీన్స్ మినహాయిస్తే సినిమా మొత్తం హీరోతో రామచంద్ర గారు ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఉంటారు.

ఇక ఆ సినిమా షూటింగ్ అపుడు బాగా ఎంజాయ్ చేశామని దాదాపు 50 రోజుల పైనే అందరం కలిసి ఉండడం వల్ల ఒక్కసారిగా షూటింగ్ అయిపోగానే బాధగా అనిపించింది, ఇక షూటింగ్ మొదట్లో నేను బయపడ్డాను అంటూ రామచంద్ర తెలిపారు. రవితేజ లాంటి స్టార్ హీరోతో మొదటి సారి చేయడం వల్ల కొంచం భయమేసింది కాకపోతే ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. నేను భయపడుతున్నానని గమనించి నాతో ఫ్రీగా ఉండు అంటూ చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు అంటూ చెప్పారు.