Connect with us

Featured

Actress Shiva Parvathi : రామ్ గోపాల్ వర్మనే కరెక్ట్.. కృష్ణంరాజు గారు చనిపోతే ఒకరోజు షూటింగ్ ఆపలేరా?? ఆయనకు కనీస గౌరవం ఇవ్వలేదు : నటి శివ పార్వతి

Published

on

Actress Shiva Parvathi : తెలుగు వెండితెర మీద తల్లి పాత్రలలో దాదాపు 250 సినిమాలలో నటించిన శివ పార్వతి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 1991 లో రామానాయుడు నిర్మించిన పరుచూరి గోపాల కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘సర్పయాగం’ సినిమా ద్వారా తెలుగు సినిమా రంగానికి పరిచయం అయ్యారు. ఈ సినిమాలో హీరో తల్లి పాత్రలో శివ పార్వతి నటించగా… హీరోయిన్ తండ్రి పాత్రలో శోభన్ బాబు గారు నటించడం విశేషం. సర్పయాగం, ఒరేయ్ రిక్షా, మావి చిగురు, అన్నయ్య, సంక్రాంతి, శ్రీరామ రాజ్యం, శ్రీరామదాసు, సీమ సింహం మొదలైన సినిమాలలో నటించారు. సినిమాలలోనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు టీవీ సీరియల్స్ లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ పార్వతి గారు ఆసక్తికర విషయాలు మాట్లాడారు.

రామ్ గోపాల్ వర్మ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను…

ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు సంబందించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో నాటక రంగం యొక్క విశిష్టత గురించి చెప్పుకొచ్చారు. అప్పట్లో నాటక రంగం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సమాజంలో జరిగే విషయాలను జనంలోకి తీసుకు వెళ్ళడానికి ఒక మాద్యమం లాగా ఉండేదని చెప్పుకొచ్చారు. ఏదైనా చెబితే వినడం కన్నా దృశ్యరూపంలో చూపిస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఇటీవల కృష్ణంరాజు గారు స్వర్గస్థులు అయినప్పుడు అర్జీవీ చేసిన ట్వీట్ గురించి అడిగితే తన అభిప్రాయాన్ని తెలియజేసారు.

Advertisement

ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తాను అని తెలియజేసారు. గొప్ప లెజెండ్రి నటుడు చనిపోతే కనీసం ఒక రోజు షూటింగులు ఆపి వారి మీద మనకు ఉన్న గౌరవం తెలియజేయడం మన బాధ్యత అని చెప్పారు. వారు జీవించినంత కాలం సినిమాల కోసమే పాటుబడ్డారు, అలాంటి వారు చనిపోతే ఒకరోజు కాకపోయినా సగం రోజు అయినా షూటింగులు ఆపాల్సిన్నింది అని చెప్పారు. మీరు ఈ విషయం గురించి అపుడు చెప్పలేదా అని అడుగగా ఇండస్ట్రీలో పెద్దవారికి చెప్పే స్థాయిలో నేను లేను, నిజాలు మాట్లాడుకోవాలి నేను మరి ఆ పొజిషన్లో లేను, నేను ఇలా చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం మాత్రమే చెప్పగలను అని చెప్పుకొచ్చారు.

Continue Reading
Advertisement

Featured

Ari: ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును!.. అదిరిన అరి కాన్సెప్ట్ పోస్టర్

Published

on

పేపర్ బాయ్ దర్శకుడు జయ శంకర్ ప్రస్తుతం తన రెండో సినిమా అరిని ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు. అరి చిత్రాన్ని ఇప్పటికే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చూపించారు. వారంతా కూడా అరి చిత్రంపై ప్రశంసలు కురిపించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వంటి వారు కూడా అరి చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ సైతం సినిమాను చూసి మెచ్చుకున్నారు. అలా అరి చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతోన్నారు.

పేపర్ బాయ్ సినిమాను మన సమాజం నుంచి, మన నిత్యం చూసే మనుషుల జీవితాల నుంచి తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అరి చిత్రానికి కాస్త భిన్నమైన లైన్‌ను, పాయింట్‌ను ఎంచుకున్నారు. మనిషిలో ఉండే అరిషడ్వర్గాల మీద, దానికి దైవత్వం అనే పాయింట్‌ను జోడిస్తూ ఓ ఫాంటసీ చిత్రంగా మలిచాడు దర్శకుడు జయ శంకర్. ఆరు పాత్రల చుట్టూ ఈ చిత్రం తిరుగుతుందని తెలుస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్

తాజాగా అరి చిత్రంలోని మెయిన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అనే క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్‌ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినోద్ వర్మకు సంబంధించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతోంది. పోస్టర్‌లో కనిపిస్తున్నట్టుగా ఆ లైబ్రరీ కథ ఏంటి? ఇక్కడ అన్ని కోరికలు తీర్చబడును అంటూ కనిపించిన ఆ క్యాప్షన్ వెనుకున్న అర్థం ఏంటి? అసలు వినోద్ వర్మ పాత్ర ఏంటి? ఆ క్యాప్షన్ మధ్యలో ఓ నెమలి పించం ఎందుకు కనిపిస్తోంది? ఇలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు ప్రకటించనున్నారు.

Advertisement

Continue Reading

Featured

Rana: నన్ను ఏదైనా అడగాలంటే అవయవాలు దానం చేయాలి… రానా కామెంట్స్ వైరల్!

Published

on

Rana: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. ఈయన లీడర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. ఇలా దగ్గుబాటి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి రానా ఎన్నో విభిన్న కథ చిత్రాలను ఎంపిక చేసుకొని ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

ఇక తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే హీరోగా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో నటించడానికి కూడా రానా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే పలు సినిమాలలో విలన్ పాత్రలలో నటించారు. ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందినటువంటి ఈయన ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా రానా గుర్గావ్ లో జరిగిన సినాప్స్ వేడుకలలో రానా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆరోగ్యం గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రానా ఇటీవల కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈయన తన అనారోగ్య సమస్యల గురించి మాట్లాడుతూ..

Advertisement

ప్రకృతికి మించిన వైద్యం లేదు…
ఎవరైనా నా ఆరోగ్యం గురించి ఏదైనా అడగాలి అంటే ముందుగా మీరు అవయవాలు దానం చేస్తానని చెప్పండి. అలాంటి ఆలోచన మీకు ఉంటేనే నన్ను నా ఆరోగ్యం గురించి అడగండి లేదంటే ఆలోచనను విరమించుకోండి అంటూ ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనిషి చివరిదశలో ఉన్నప్పుడే జీవితాన్ని విభిన్నంగా చూస్తాడు.ఆ క్షణం ఆలోచన విధానం మారిపోతుంది. ఇందుకు నేను మినహాయింపు కాదని తెలిపారు. అనారోగ్య సమస్యల కారణంగా బాహుబలి సినిమా సమయంలో పెరిగిన బరువు పూర్తిగా తగ్గిపోయానని అనంతరం అరణ్య సినిమా కోసం ఏడాది పాటు అడవులలో తిరుగుతూ ఉన్నానని ప్రకృతికి మించిన వైద్యం మరేది లేదంటూ ఈ సందర్భంగా రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

NTR: ఎన్టీఆర్ సినిమా చేయాలంటే ఈ రెండు ఉండాల్సిందేనా?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే ఈ సినిమా అక్టోబర్లో దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదిలా ఉండగా తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎన్టీఆర్ ఒక సినిమా చేయాలి అంటే కచ్చితంగా ఆయన ఒప్పుకొనే సినిమాలలో రెండు అంశాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలని ముందుగానే దర్శక నిర్మాతలకు సూచిస్తారట మరి ఎన్టీఆర్ సినిమాలలో తప్పనిసరిగా ఉండాల్సిన ఆ అంశాలు ఏంటి అనే విషయానికి వస్తే..

Advertisement

డాన్స్… యాక్షన్ సీక్వెన్స్..
ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తన సినిమాలు డాన్స్ చేసే విధంగా పాటలకు స్కోప్ ఉండాలని ఈయన కండిషన్ పెడతారట అదే విధంగా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉండాలని ఈయన దర్శక నిర్మాతలకు చెబుతారట. ఈ రెండు తన సినిమాలలో తప్పనిసరిగా ఉండేలా ఎన్టీఆర్ జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ డాన్స్ అంటే ఇష్టపడేవారు ఎంతోమంది ఉన్నారనే సంగతి మనకు తెలిసిందే.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!