మూడు పెళ్లిళ్లు పటాకులు.. ఇప్పుడు నాలుగో పెళ్లి.. కాకపోతే ఈ పెళ్లి స్పెషల్?

0
1352

వనితా విజయ్ కుమార్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాదాలకు తావిస్తూ నిత్యం వార్తల్లో ఉండే ఈ నటి నిజజీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆ మూడు పెళ్లిళ్లు పెటాకులుగా మార్చి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. తనపై వచ్చే నెగెటివ్ కామెంట్లను తిప్పికొడుతూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలిచే వనితా గత కొద్ది రోజుల నుంచి నాలుగో పెళ్లి చేసుకోబోతుంది అంటూ పెద్దఎత్తున వార్తలు వినిపించాయి.

ఈ క్రమంలోనే ఓ జ్యోతిష్యుడు వనితా విజయ్ కుమార్ నాలుగవ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు మొదటి అక్షరం ఎస్ తో మొదలవుతుందని, పెళ్లి తర్వాత ఆమె రాజకీయాలలోకి వచ్చి తనదైన ముద్ర వేసుకుంటారని చెప్పారు. అయితే ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాట నిజమవుతుందా అంటే అవునని చెప్పవచ్చు.

తాజాగా వనితా విజయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె తమిళ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నటుడు శ్రీనివాస్ ను పెళ్లి చేసుకున్న ఫోటో షేర్ చేశారు. ఈ ఫోటోలో ఇద్దరూ ఎంతో అందంగా పెళ్లి దుస్తులలో ముస్తాబయ్యి ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు వనిత నిజంగానే 4వ పెళ్లి చేసుకుందా అంటూ ఆశ్చర్యపోయారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ పెళ్లి ఫోటో నిజం కాదని… వనిత నాల్గవ పెళ్లి చేసుకోలేదని.. కేవలం వనితావిజయ్ కుమార్, శ్రీనివాస్ కలిసి నటిస్తున్న ఓ సినిమాలో భాగంగా ఆ సినిమాకు సంబంధించిన స్టిల్స్ అని చెప్పడంతో గత కొద్దిరోజుల నుంచి ఈమె నాల్గవ పెళ్లి పై వస్తున్నటువంటి వార్తలకు పుల్ స్టాప్ పెట్టి నట్లయింది.