Advocate Udhay Kanth : కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద రెండేళ్ల జైలు శిక్ష వేయాలనే సూరత్ కోర్ట్ తీర్పుతో ఒక్కసారిగా దేశ రాజాకీయాలు వేడెక్కాయి. ప్రధాని మోడీ పేరును ఉపయోగిస్తూ అవమానకర వాఖ్యలు చేసారనే నేపథ్యంలో రాహుల్ గాంధీ మీద 2019 లో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు కాగా నేడు కోర్ట్ తీర్పును ఇచ్చింది. అయితే రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంట్ లో మోడీ, అదాని బందం గురించి మాట్లాడిన తరువాత సూరత్ కోర్ట్ నుండి తీర్పు రావడం పట్ల కక్ష్య పూరిత చర్యగా దీన్ని అభివర్ణిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఒకరోజు సత్యాగ్రహం కూడా తల పెట్టారు. ఇక ఈ విషయం గురించి బీజేపీ నియంత్రత్వ నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు విశ్లేషించారు.

బీజేపీ కక్ష్య పూరితంగా వ్యవహారిస్తోంది….
2019లో కర్ణాటక ఎన్నికల సందర్భంగా కోలార్ సభలో రాహుల్ మోడీలకు దోచిపెడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పరువునష్టం దావా వేశారు. అయితే హైకోర్టులో ఆ కేసు విచారణ చాలారోజుల వరకు పెండింగ్‌లో ఉండగా, తాజాగా లోక్‌సభలో అదానీ అంశంపై విపక్ష నేత రాహుల్‌గాంధీ ఫిబ్రవరి 7న మోదీ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ,అదానీ బంధాన్ని ప్రశ్నించారు. దీంతో మోదీ ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహారిస్తూ రాహుల్ గాంధీ మీద రెండేళ్ల శిక్ష పడేలా కేసును వాడుకుందని అలా రెండేళ్లు శిక్ష వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు అనేది బీజేపీ వ్యూహం అంటూ అడ్వకేట్ ఉదయ్ కాంత్ గారు అభిప్రాయపడ్డారు.

మొదట్లో కేసును ఉపసంహరించుకున్న పిటిషన్‌దారు మోడీ, అదాని బంధం గురించి రాహుల్ లోక్ సభలో మాట్లాడిన అనంతరం సూరత్‌కోర్టును తిరిగి ఆశ్రయించడం పట్ల అనుమానాలు ఉన్నాయంటూ తెలిపారు. ఫిబ్రవరి 27న ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. మార్చి 17న విచారణ ముగించి, తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం, 23న రాహుల్‌కు శిక్షను ఖరారు చేసింది. కేవలం 24 రోజుల్లో విచారణ పూర్తిచేసి శిక్ష ఖరారు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఉదయ్ కాంత్ అభిప్రాయపడ్డారు. తమ పాలనను ప్రశ్నిస్తే ఇలా శిక్షిస్తాం అన్నట్లుగా మోదీ తీరు ఉందని అభిప్రాయపడ్డారు.