Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇలా ఈయన హీరోగా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సీక్వెల్ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.

ఇలా సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేయడంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ గురించి నటి భాను శ్రీ మెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.ఈమె అల్లు అర్జున్ తో కలిసి వరుడు సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈమెకు కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు.
ఇలా అవకాశాలు లేకపోవడంతో క్రమక్రమంగా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ తనని ట్విట్టర్ లో బ్లాక్ చేశారంటూ ఆరోపణలు చేశారు. ఇలా ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చేసిన రెండు గంటలకి ఈమె మరొక పోస్ట్ చేశారు.

Allu Arjun: బన్నీ పై ఆరోపణలు చేయలేదు…
గ్రేట్ న్యూస్ బన్నీ తనని ట్విటర్ లో అన్ బ్లాక్ చేశారంటూ మరొక ట్వీట్ చేశారు.అయితే ఈ ట్వీట్ చేసినటువంటి ఈమె తన కెరియర్ ఇలా ఉండటానికి అల్లు అర్జున్ ఏమాత్రం బాధ్యుడు కాదని తను అల్లు అర్జున్ గురించి ఏ విధమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు అంటూ తెలిపారు. అయితే ఈమె చేసిన ఈ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ గా మారడంతో అల్లు అర్జున్
అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అసలు మా హీరోతో ఇలాంటి ఆటలు ఆడుకోవడం ఏంటి అంటూ పెద్ద ఎత్తున ఈమెపై మండిపడుతున్నారు.