Analyst Damu Balaji : ఏపీ లో రాజకీయ వేడి ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అపుడే మొదలయింది. వేసవిలో మరింత సెగలను కక్కిస్తూ పొత్తుల చర్చలు ఒకవైపు సాగుతుంటే, జంపింగ్ జపాంగులు ఏ పార్టీ లోకి జంప్ అవ్వాలా అని లెక్కలేసుకుంటున్నారు. జనసేన టీడీపీ జట్టు కట్టి బీజేపీ కూడా మాతో వస్తే సమిష్టిగా వైసీపీ ని ఓడిద్దాం అంటుంటే మరోవైపు టీడీపీ టెంట్ హౌస్ జనసేన అంటూ వైసీపీ విమర్శిస్తుంది. మీడియాకు ఎప్పుడు దగ్గర ఉంటూ పేరుకి వైసీపీ ఎంపీ అయినా కూడా వైసీపీ పార్టీ ని సీఎం జగన్ ను విమర్శించడమే పనిగా ఉన్న స్వపక్షంలో విపక్షం అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అయిన ఎంపీ రఘురామకృష్ణ గారు ఈసారి జనసేన వైపు వెళ్ళనున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. అసలీ వార్తలోని లోగుట్టును అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

జనసేన వైపు ఆర్ఆర్ఆర్… చంద్రబాబు ప్లాన్ ఇది…
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ, టీడీపీ జట్టు చేరి ఇద్దరం కలిసే పోటీ చేద్దాం, ఎన్నికల్లో మీరెన్ని సీట్లిచ్చిన పర్వాలేదు అని చెప్పేసింది. ఇక జనసేన నుండి ఒక 30 మంది పోటీ చేస్తారని అనుకున్నా పార్టీలో ప్రముఖంగా కనిపించే మొహాలు మూడే పవన్, నాగబాబు, నాదెండ్ల మనోహర్. ఇక మిగిలిన వాళ్ళు ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అందుకే చంద్రబాబు తాను సీట్స్ ఇవ్వలేను అనుకున్న వాళ్ళను జనసేన లోకి పంపి అక్కడి నుండి గెలిపించుకుంటాడు అనేది అందరికీ తెలిసిన విషయం అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

అలానే ఇప్పుడు రఘు రామ కృష్ణంరాజు చంద్రబాబుకి సన్నిహితుడు కానీ టీడీపీ నుండి సీట్ ఇవ్వలేడు కనుక జనసేనపార్టీలో చేర్పించి ఆ పార్టీ నుండి సీటిస్తాడు అంటూ చంద్రబాబు చెబితేనే ఆర్ఆర్ఆర్ జనసేన లోకి వెళ్తాడు అంటూ చెప్పారు బాలాజీ. చంద్రబాబు ఈ వ్యూహం చాలా ఏళ్లనుండే అమలు చేస్తున్నారని వేరే పార్టీలలో కూడా తన వాళ్ళను పెట్టడం ఆయన స్టైల్ రాజకీయం అంటూ చెప్పారు. తేడా వస్తే రేప్పొద్దున జనసేనలో చీలిక అంటూ మనమే వింటాం, చివరికి జనసేన లో పవన్ మిగులుతాడు అంటూ అభిప్రాయ పడ్డారు.