Analyst Damu Balaji : పవన్ కళ్యాణ్ ను మరోసారి రెచ్చగొడుతున్న వర్మ… ట్వీట్లతో జనసేనాని పై విరుచుకుపడుతున్న అర్జీవీ…: అనలిస్ట్ దాము బాలాజీ

0
37

Analyst Damu Balaji : వైసీపీ పార్టీ తీర్థం పూచ్చుకోక పోయినా ఆ పార్టీ అధికార ప్రతినిధిలాగా ఛాన్స్ వచ్చిందంటే చాలు టీడీపీ, జనసేన మీద విరుచుకుపడుతూ ట్వీట్స్ పెట్టడం, యూట్యూబ్ లో సొంత ఛానెల్ లో వీడియోస్ వదలడం ఆర్జీవి కొత్త కాలక్షేపం. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యణ్ టీడీపీ తో వచ్చే ఎన్నికలకు కలిసి వెళ్తున్నట్లు చెప్పడం, మూడు సార్లు చర్చలకు వెళ్లడంతో ఈ విషయం మీద ఘాటుగానే ఆర్జీవి స్పందించాడు. ఇక ఆర్జీవి ట్వీట్ చేసిన విషయాలకు జనసైనికుల నుండి ఎలాంటి విమర్శలు ఎదురావుతాయో చూడాలి. అయితే ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నీకంటే గాలి జనార్దన్ రెడ్డి మేలు…

పవన్ కళ్యాణ్ మీద ఆర్జీవి కామెంట్స్ చేయడం కొత్త కాదు. కావాలనే పవన్ అభిమానులను, మెగా అభిమానులను గిల్లుతుంటాడు ఆర్జీవి. అయితే తాజాగా కర్ణాటక ఎలక్షన్స్ కి ముడిపెడుతూ పవన్ ను ఆడిపోసుకున్నాడు. కర్ణాటక లో బీజేపీ నుండి బయటికి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పెట్టి ఎంతో కాలం కాలేదు ఈ ఎన్నికలలో నలుగురిని గెలిపించుకున్నాడు. మన ఏపీలో పదేళ్ళైనా ఇంకా వేరేవాళ్లతో పొత్తు కోసం వేంపర్లాడడం సరిపోయింది. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ధైర్యం లేదు, ఇంకెప్పుడు పార్టీని నిలబెట్టుకుంటావు అంటూ జనసేనాని మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవి.

ఇక తన ఓటమికి జనాలను నిందించే నాయకుడు అంటూ వెటకారం చేసాడు. ఏదైనా ఒక వస్తువు అమ్ముడుపోకపోతే ఆ వస్తువు కొనని వినియోగదరుడిదే తప్పు అని ఒక కంపెనీ చెబితే ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ నా ఓటమికి కారణం జనాలే అన్నపుడు అలాగే ఉంటుంది అంటూ ఆర్జీవి మాట్లాడారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్వతహాగా పోటీ చేసి ఉంటే అధికారంలోకి రాకపోయినా కనీసం కొన్నిసీట్లు గెలిచి పార్టీ పటిష్టం అయ్యేది. అలా కాకుండా 40 ఇచ్చినా ఒకే 30 ఇచ్చినా ఒకే అంటూ టీడీపీ వెనుక పడటం వల్ల ఇమేజ్ డామేజ్ అవుతుంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.