Analyst Damu Balaji : భారత్ అంటే కొంతమంది బ్రిటిష్ వాళ్లకు ఎందుకంత కుళ్ళు… ఈ సమయంలో ప్రకాశం రాజ్ కి అలాంటి ట్వీట్ అవసరమా…: అనలిస్ట్ దాము బాలాజీ

0
95

Analyst Damu Balaji : భారత్ ఎంత అభివృద్ధి చెందుతోందో నిదర్శనంగా ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రపంచానికి చూపింది. ఇంతవరకు ఏ దేశం వెళ్లని చంధ్రుడి దక్షిణ ధ్రువం వైపున విక్రమ్ ల్యాండర్ ను పంపి రికార్డు సృష్టించింది. ఇక ప్రపంచం అంత దీనికి ప్రశంసలు కురిపిస్తుంటే కొంతమంది విధేశీయులు మాత్రం తమ అసూయా, ఈర్ష్యలను బయటపెట్టుకుంటున్నారు. ఖచ్చితంగా పాకిస్తాన్ ఆ పని చేసి ఉంటుందని అనుకుంటారు కానీ పాకిస్థానీలు చాలా మంది భారత్ విజయాన్ని ప్రశాంసిస్తున్నారు. అలా కుళ్ళు చూపెట్టుకున్నది మనల్ని బానిసలుగా పరిపాలించిన మనల్ని లూటి చేసి వెళ్లిన బ్రిటిష్ కి చెందిన కొంతమంది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

చంద్రయాన్ విషయంలో కుళ్ళుతున్న బ్రిటిష్ దేశస్థులు….

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అయ్యాక చాలా మంది తక్కువ ఖర్చుతో ఇండియా గొప్ప పని చెసిందంటు ప్రశాంసిస్తుంటే బ్రిటిష్ దేశానికి చెందిన ఒక న్యూస్ ఛానెల్ మాత్రం తన కుళ్ళు బయట పెట్టింది. ఇండియా మన దగ్గరి నుండి వేల కోట్ల రూపాయలను ఎయిడ్ రూపంలో తీసుకుంటోంది. ఈ ప్రయోగానికి అన్ని వందల కోట్లు పెట్టే స్థోమత ఉన్నపుడు మన దగ్గర తీసుకున్న అప్పు వెనక్కి కట్టవచ్చు కదా అంటూ కథనాలను ప్రసారం చేసింది. అయితే చాలా మంది నెటిజన్స్ ఈ కామెంట్స్ కు ధీటుగా స్పందించారాని బాలాజీ తెలిపారు. నిజానికి బ్రిటిష్ వాళ్ళను ఇండియా అప్పు అడగలేదు. కేవలం క్రిస్టియానిటీ వ్యాప్తి కోసం కొన్ని ఎన్జిఓ లకు వాళ్ళే ఎయిడ్ రూపంలో డబ్బు ఇస్తున్నారు. అధికాక మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒకానొక సందర్బంలో మాకు మీ నుండి వచ్చే ఎయిడ్ అవసరం లేదు అని చెప్పడం కూడ జరిగింది అంటూ సోషల్ మీడియా ద్వారా ఆ న్యూస్ ఛానెల్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మనవాళ్ళు. ఇక ప్రఖ్యాత బిబిసీ కి సంబంధించిన బ్రిటిష్ రిపోర్టర్ కూడ ఇండియా లో ముందు వ్యక్తిగత టాయిలెట్స్ కట్టించవచ్చు కదా చంద్రుడి మీదకు ప్రయోగం అవసరమా అంటూ కామెంట్స్ చేసాడు.

ఇదిలా ఉంటే బ్రిటిష్ర్స్ ఇలా వెటకారం చేయడం పక్కన పెడితే నటుడు ప్రకాష్ రాజ్ చంద్రయాన్ ప్రయోగం మీద ట్వీట్ చేసాడు. విక్రమ్ ల్యాండర్ వెళ్లేసరికి అప్పటికే అక్కడ ఒక మళయాళి టీ షాప్ ఉన్నట్లుగా ఉండే ఆ పోస్ట్ చాలా మందికి కోపం తెప్పించింది. నిజానికి నీల్ అంస్ట్రాంగ్ చంద్రుడిలో పై కాలుమోపినపుడు వచ్చిన జోక్ ను ప్రకాష్ రాజ్ తప్పు సందర్భంలో పోస్ట్ చేయడం వల్ల అందరికి కోపం వచ్చింది. అయితే యాంటి బీజేపీ అయిన ప్రకాష్ రాజ్ ఇండియా సాధించిన విజయాన్ని కూడా బీజేపీ పాలన ఖాతాలోకి వేసి చూడటం వల్ల మరింత ప్రజల నుండి ద్వేషాన్ని మూటగట్టుకుంటున్నాడు అంటూ బాలాజీ తెలిపారు.