Connect with us

Featured

Analyst Damu Balaji : శాకుంతలం సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు… సమంత షాకింగ్ పోస్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

Published

on

Analyst Damu Balaji : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఈ సినిమా తాజాగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమాలో కొన్ని లోపాలు అలాగే గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఫలితంతో నాకేం సంబంధం లేదంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన విశ్లేషణ అందించారు.

Advertisement

భగవద్గీత శ్లోకంతో సమంత…

శాకుంతలం సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక సమంత మొహం ఫ్రెష్ గా సినిమాలో అనిపించలేదు. చిన్నవయసు అమ్మాయి అయి ఉంటే శకుంతల పాత్రకు ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది అంటూ దాము బాలాజీ మాట్లాడారు. ఇక సినిమా ఫ్లాప్ అవడం గురించి సమంత పరోక్షంగా మాట్లాడటం గురించి ఆయన మాట్లాడుతూ భగవద్గీత లోని ఒక శ్లోకాన్ని చెబుతూ నేను సినిమాలో నటించాను అంతే, సినిమా ఫలితంకి నేను బాధ్యురాలిని కాదు అన్నట్లుగా ఆమె మాట్లాడారు అంటూ అభిప్రాయపడ్డారు.

క్రిస్టియన్ అయిన సమంత ఇలా భగవద్గీత శ్లోకం పెట్టడం, అందులోనూ ఖచ్చితంగా అది శాకుంతలం సినిమా ఫ్లాప్ అవడం గురించే అంటూ చర్చలు నడుస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమంత లండన్ లో సిటడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వెళ్లారు అంటూ చెప్పారు. తన పని తాను చేసుకుపోతానని ఫలితంతో నాకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేసింది సామ్.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Bigg Boss 8: బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వచ్చారు బ్రో…. ఆ కంటెస్టెంట్లను ఆడేసుకుంటున్న ట్రోలర్స్!

Published

on

Bigg Boss 8: బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం తెలుగులో ఇప్పటికి ఏడు సీజన్లను పూర్తి చేసుకుని ఎనిమిదవ సీజన్ కూడా గత ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. మొదట 14 మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించారు. మిగిలిన వారిని ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపించబోతున్నారని సమాచారం.

Advertisement

ఇక హౌస్ లోకి వెళ్లిన తర్వాత మొదటి రోజు నుంచే కంటెస్టెంట్లు పెద్ద ఎత్తున గొడవలు పడుతూ పోట్లాడుతూ ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే బాగా ఎక్స్పోజ్ అవుతున్నారు. మిగిలిన వారు మాత్రం అసలు హౌస్ లో ఉన్నారా లేదా అన్నా సందేహాలు వస్తున్నాయి. హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంతో యాక్టివ్ గా వెళ్లిన కంటెస్టెంట్లు లోపల మాత్రం అనుకున్న స్థాయిలో కంటెంట్ ఇవ్వలేకపోతున్నారనే చెప్పాలి.

ముఖ్యంగా హీరో ఆదిత్య ఓం అయితే హౌస్ లో ఉన్నాడా లేదా అన్న సందేహం మాత్రం అందరికీ కలుగుతుంది. ఈయన ఉంటే ఒంటరిగా ఉంటారు లేకపోతే నిద్రపోతూ ఉంటారు. పెద్దగా ఫేమస్ అయిన కంటెంట్ మాత్రం ఈయన ఇవ్వలేకపోతున్నారు. దీంతో పలువురు ట్రోలర్స్ బ్రో అసలు ఎందుకొచ్చావు బ్రో బిగ్ బాస్ హౌస్ కి అంటూ భారీగా విమర్శలు చేస్తున్నారు.

ఈయనతో పాటు బెజవాడ బేబక్క కూడా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా కనిపించే ఈమె హౌస్ లో మాత్రం ఎక్కువగా కిచెన్ లోనే ఉంటుంది. కానీ సరైన కంటెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు.అఫ్రిదీ కూడా డల్‌గానే ఉన్నాడనే టాక్‌ వస్తుంది. పృధ్విరాజ్, అభయ్ నవీన్ వంటి వారందరూ కూడా హౌస్ లో డల్ గా కనిపిస్తున్న తరుణంలో పలువురు మీరంతా హౌస్ లోకి ఎందుకు వచ్చారో ఏమో అంటూ వీరిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు అలాగే మరి కొంతమందిని బాగా హైలైట్ చేస్తూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎలిమినేషన్ ఉంటుందా…
ఇక ఈ వారం నామినేషన్స్ లో భాగంగా బెజవాడ బేబక్క, విష్ణు ప్రియ, శేఖర్ భాష, నాగ మణికంఠ సోనియా ఆకుల ప్రేరణ వంటి వారు నామినేషన్ లో ఉన్నారు. అయితే గత సీజన్లో మాదిరిగా ఈ సీజన్లో కూడా మొదటి వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Star Actors: మా హీరోలను చూసి నేర్చుకోండి.. ఆ హీరోలలో కనుమరుగైన మానవత్వం.. ఇప్పటికైనా మారండి?

Published

on

Star Actors: సినిమా ఇండస్ట్రీలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. తెలుగు సినిమాలు మంచి సక్సెస్ అవ్వడమే కాకుండా తెలుగు హీరోలు వందల కోటలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇలా తెలుగు హీరోలకు ఇంత మంచి క్రేజ్ రావడానికి కారణం ప్రేక్షకులని చెప్పాలి. ఇక తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి పాన్ ఇండియా స్థాయికి వెళ్ళిన తర్వాత ఎంతోమంది ఇతర భాషా హీరోలు కూడా తెలుగు ఇండస్ట్రీపై కన్నేశారు.

Advertisement

వారు నటించిన సినిమాలను తెలుగులో కూడా విడుదల చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోషన్ల కోసం హైదరాబాద్ ఆంధ్ర వంటి ప్రదేశాలకు వస్తూ మాకు తెలుగు ప్రేక్షకులు అంటే అభిమానం తెలుగు రాష్ట్రాలు అంటే అభిమానం అంటూ గొప్పలు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఉన్నా కూడా ఇతర భాష హీరోలు మాత్రం ఈ సంఘటనలపై స్పందించిన దాఖలాలు లేవు.

తెలుగు ప్రేక్షకులు అంటే అభిమానం అని చెప్పిన హీరోలు ఆ తెలుగు ప్రేక్షకులు ఆపదలో ఉంటే కనీసం సహాయం చేయటానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో వచ్చిన వరదల కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు కోట్ల రూపాయల విరాళం అందించారు.

ఈ క్రమంలోనే తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజినీకాంత్,విజయ్ దళపతి, ధనుష్, సల్మాన్, షారుఖ్ ఖాన్, మోహన్లాల్, మమ్ముట్టి వంటి హీరోలు మాత్రం ఇప్పటి వరకు కనీసం ఈ ఘటనపై స్పందించిన దాఖలాలు లేవు. ఇక రియల్ హీరో సోనుసూద్ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించి తన ట్రస్టు ద్వారా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు.

Advertisement

ఒక్కరు సాయం ప్రకటించలేదు..
ఇక పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఏదైనా ఆపద వస్తే మన తెలుగు హీరోలు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం అందిస్తారు. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఆపదలో ఉంటే ఈ హీరోలలో మానవత్వం కూడా పూర్తిగా కరువైందని ఈ విషయంలో మా హీరోలను చూసి మారండి అంటూ పలువురు అభిమానులు ఇతర భాష హీరోలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Bollywood: తెరపై ప్రేక్షకులను భయపెట్టిన విలన్లు… వీరి భార్యలు గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Published

on

Bollywood: ప్రస్తుత కాలంలో సినిమాలలో హీరోలతో పాటు సమానంగా విలన్లు కూడా మంచి క్రేజీ సొంతం చేసుకున్నారు. ఇక ఇటీవల కాలంలో వచ్చే సినిమాలలో హీరోల కంటే విలన్లు అందంగా కనిపిస్తున్నారు. కానీ ఒకప్పుడు విలన్ అంటేనే చూడటానికి భయంకరంగా ఉండేవారు.

Advertisement

వారిని తెరపై చూస్తే పిల్లలు కూడా భయపడే విధంగా వారి వేషధారణ ఉండేది. ఇక విలన్ పాత్రలలో నటించడానికి కొంతమంది సెలబ్రిటీలు ప్రత్యేకంగా ఉండేవారు కానీ ప్రస్తుత కాలంలో హీరోలు కూడా విలన్లుగా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో భయంకరమైన విలన్ పాత్రలు పోషించిన శక్తి కపూర్, అశుతోష్ రాణా, నవాబ్ షా , కెకె మీనన్.. ఈ నలుగురు బాలీవుడ్ తెరపైకి రాగానే ప్రజలను ఎంతో భయభ్రాంతులకు గురి చేశారు.

ఇలా తెరపై ప్రేక్షకులను భయపెట్టిన ఈ విలన్ల భార్యలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీరి భార్యల బ్యాగ్రౌండ్ తెలిస్తే మాత్రం తప్పకుండా షాక్ అవ్వాల్సిందే.

శివాంగి కొల్హాపురే: శివాంగి 80వ దశకంలో చాలా సినిమాల్లో నటించింది. మిథున్ నుండి అమితాబ్ బచ్చన్ వరకు ఈమె ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే విలన్ శక్తి కపూర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

Advertisement

రేణుకా షహానే: రేణుక హిందీ మరాఠీ చిత్రాలలో అనేక టెలివిజన్ నిర్మాణాలలో తన పనికి ప్రసిద్ధి చెందింది. ఇలా టెలివిజన్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎన్నో పురస్కారాలను అందుకున్న రేణుక అశుతోష్ రానాను వివాహం చేసుకుంది. అయితే ఇది ఈమెకు రెండవ వివాహం ఈమె మొదట్లో విజయ్ కెంకరేను వివాహం చేసుకుంది. కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడంతో 2001వ సంవత్సరంలో ఆశుతోష్ ను పెళ్లి చేసుకున్నారు.

పూజా బాత్రా: ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బాత్రా 1993 సంవత్సరంలో ఫెమినా మిస్ ఇండియా పోటీలో రన్నరప్ టైటిల్ గెల్చుకున్నారు. అంతేకాకుండా ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 1993 కిరీటాన్ని పొందింది . మిస్ ఇంటర్నేషనల్ 1993లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. ఆ తర్వాత బాలీవుడ్‌ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఈమె నవాబ్ షాను రెండో వివాహం చేసుకున్నారు. ఈమె వివాహం అప్పట్లో సంచలనంగా మారింది..

Advertisement

స్టార్ హీరోయిన్స్..
నివేదా భట్టాచార్య: నివేదిత బుల్లితెర నుంచి వెండితెర వరకు చాలా క్రేజ్ దక్కించుకుంది. ఇలా బుల్లితెరపై మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న నివేదా
కెకె మీనన్‌ని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఈ నలుగురు విలన్లు అయినప్పటికీ వీరి భార్యలు మాత్రం ఎంతో క్రేజ్ ఉన్న నటీమణులు కావటం విశేషం.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!