Astrologer Venu Swami : ప్రముఖ ఆస్ట్రాలజర్ అంటూ చెప్పుకుని తిరిగే వేణు స్వామి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల జీవితాల్లో జరగబోయేవి ఇవే అంటూ ఎప్పటికప్పుడు చెబుతూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాడు. గతంలో ఇలాగే సమంత నాగచైతన్య విడిపోయాక వాళ్ళు విడిపోతారని నేను ముందే చెప్పానని అన్నాడు. ఇక రష్మిక తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పిందే నేనని, తనతో వాళ్ళింట్లో ప్రత్యేక పూజలు కూడా చేసానంటూ చెప్పారు. ఇక మెగాస్టార్ కూతురు శ్రీజది వాళ్ళ బాబాయ్ జాతకం లాంటిదంటూ మూడో పెళ్లి చెసుకుంటుందంటూ మాట్లాడాడు. వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతూ ఉండే వేణు స్వామి ఇటీవల మద్యం, మాంసం గురించి మాట్లాడిన మాటలకు పెద్ద చర్చే జరిగింది.

ఇది కలియుగం, తప్పేంటి…
వేణు స్వామి అందరి ఆస్ట్రాలజర్స్ లాగా కాకుండా లగ్జరీగా ఉండటం, విదేశాలకు వెళ్ళడం వంటివి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇటీవలే ఆయన దుబాయ్ లో సూటు బూటు లో షేడ్స్ పెట్టుకుని కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఈ విషయాల గురించి మాట్లాడుతూ తప్పేంటి అలా ఉంటే, ఇది కలియుగం అంటూ మాట్లాడారు వేణు స్వామి. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, ఆయన వాడే సుగంధ ద్రవ్యాలు, అలంకారాలు ఇవన్నీ చూసుకుంటే మనమెంత అంటూ మాట్లాడారు.

మా కమ్యూనిటీలో వాళ్లకు నేను మందు, మాంసం గురించి మాట్లాడటం అభ్యంతరం కలిగించుండవచ్చు కానీ వాళ్ళు బయటికి చెప్పనిది నేను ఓపెన్ గా చెప్పానంతే, ఒకరు మనకు బట్టలువిప్పి నిలబెట్టాలనే లోపే మనమే విప్పేస్తే మంచిది. ఇంకొకడు మనలో లోపాలు వెతికేకన్నా ముందే మన లోపాలు మనమే బయటపెడితే వాడు వెతకడానికి ఏమీ ఉండవు అంటూ వేణు స్వామి క్లారిటీ ఇచ్చారు. నా వేషధారణ నా అభిరుచులు కొంతమందికి నచ్చక పోవచ్చు, అయితే నేను ఎలా ఉంటానో అన్నది నేనే చెప్పేస్తే మీడియా వాళ్ళు క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ వైరల్ చేయాల్సిన పని ఉండదు, కాంటావేర్సీ కోసం నేను ఏ విషయం మాట్లాడను అంటూ చెప్పారు.