బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ షోలో ఈ సీజన్ లో అందరి కంటే ఎక్కువగా ప్రేక్షకులకు ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరంటే ఆ కంటెస్టెంట్ గంగవ్వే అని చెప్పాలి. మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానెల్ లో 200కు పైగా వీడియోల్లో నటించిన గంగవ్వ బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. గంగవ్వ కోసం సోషల్ మీడియాలో ఆర్మీలు పుట్టుకొచ్చాయి. అరవై ఏళ్ల వయస్సులో గంగవ్వ బిగ్ బాస్ లాంటి షోలో పాల్గొనడం సాహసం అనే చెప్పాలి.

ఆరోగ్య సమస్యల వల్ల బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేటై బయటకొచ్చిన గంగవ్వ బిగ్ బాస్ షో గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అటు కంటెస్టెంట్లకు ఇటు ప్రేక్షకులకు దగ్గరైన గంగవ్వ తన రెమ్యునరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బిగ్ బాస్ షో నుంచి తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని వెల్లడించి ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చారు. అయితే రెమ్యునరేషన్ అందకపోయినా వాళ్లు మరో విధంగా సాయం చేస్తారని తనకు నమ్మకం ఉందని గంగవ్వ తెలిపారు.

తనకు సొంత ఊరిలోనే ఇల్లు కావాలని హైదరాబాద్ లేదా మరో ప్రాంతంలో వాళ్లు ఇల్లు కట్టిస్తానని చెప్పినా తాను అంగీకరించనని ఆమె వెల్లడించారు. మరోవైపు నాగార్జున గంగవ్వకు ఇల్లు కట్టిస్తానని ఇచ్చిన హామీ వల్లే బిగ్ బాస్ నుంచి గంగవ్వకు రెమ్యునరేషన్ అందకపోవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇల్లు కట్టిస్తున్నామని చెప్పి రెమ్యునరేషన్ ఇవ్వకపోవడం అన్యాయనం అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు గంగవ్వ ఇంటి పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియాల్సి ఉంది. ఆదివారం రోజున బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ కుమార్ సాయి ఎలిమినేట్ కాగా నిన్నటి ఎలిమినేషన్ కు ఆరుగురు నామినేట్ అయ్యారు. మరోవైపు మోనాల్ కు బదులుగా కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని బిగ్ బాస్ షోను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here