ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకీ విశ్వరరూపం చూపిస్తోంది. ప్రతిరోజూ కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా ఎవరినీ వదలడం లేదు.. ఇప్పటికే చాలామంది పలువురు రాజకీయ నాయకులతో పాటు సినీ, క్రీడా సెబ్రిటీలను సైతం ఈ కరోనా మహమ్మారి సోకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి అమిత్ షా ను కూడా వదిలిపెట్టలేదు ఈ మహమ్మారి. తాజాగా ఆయనకు కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో.. టెస్టు చేయించగా అమిత్ షా కు కోవిడ్ పాజిటివ్ అని నిర్థారణ అయింది.

ఈ మేరకు అమిత్ షా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. అయితే డాక్టర్ ల సూచన మేరకు తాను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు అమిత్ షా తెలిపారు. అలాగే గత కొద్దీ రోజులుగా తనని కలిసిన వారు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని, ఒకవేళ లక్షణాలు కనిపిస్తే వారు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు అమిత్ షా. కాగా ఇప్పుడు అమిత్ షాకు కోవిడ్ సోకడం దేశ వ్యాప్తంగా కలకలం రేగుతోంది.
