Featured
శ్రీకృష్ణుని మరణ రహస్యం !!
Published
4 years agoon
ఎక్కడో ద్వారక. దానికి చాలా దూరంలో తపోవనం. ఆ తపోవనంలో శ్రీకృష్ణుడు తపస్సులో ఉన్నాడు.
అక్కడ ద్వారకలో శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం వదిలాడు. ఆ అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. కానీ అందుబాటులో బలరాముడు కూడా లేడు. సమస్త బంధుగణం మధ్య ఘనంగా ఆ కార్యక్రమం అర్జునుడే జరిపించాడు.
ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్తను నెమ్మదిగా చెప్పాలని వెతుక్కుంటూ ఒక్కడే తపోవనం వరకూ ప్రయాణమై వచ్చాడు. తపోవనమంతా వెతికాడు. దాదాపు రెండ్రోజులు కాళ్లరిగేలా తిరిగాడు. అలా వెతగ్గా.. వెతగ్గా మొత్తానికి ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు. కానీ ప్రాణం లేకుండా..! అర్జునుడు హతాశయుడైపోయాడు. కుమిలి పోయాడు. రోదించాడు. అది శ్రీకృష్ణ కళేబరం కాదని కూడా నమ్మాలనుకున్నాడు. అర్జునుడితో పాటూ ఉన్న రథసారధి, ఇంకా ఇద్దరు, ముగ్గురు మాత్రమే అర్జునుడిని ఓదార్చారు. అప్పటికే శ్రీకృష్ణుడు ఆ అరణ్యంలో బోయవాడి బాణం కాల్లో దిగడం వల్ల తన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడిచాయి. ఇక ఆ మృత దేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేక (ఎందుకంటే ద్వారక సరిగ్గా అప్పుడే సముద్రంలో మునగడానికి సిద్ధంగా ఉంది), అక్కడే అర్జునుడొక్కడే అరగంటలో ఏ అర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా. అంత్యక్రియలు పూర్తిచేసేసాడు.
అష్టభార్యలు, 80 మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ఉన్న శ్రీకృష్ణుడికి అంత్యక్రియల సమయానికి బావైన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కొడుకులున్నా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు. అంతటి ఇతిహాస పురుషులకే అటువంటి అంతిమ ఘడియలు తప్పలేదు. మహానుభావుల మరణాలు కూడా కాలక్రమంలో సందేశాలు, ఊరటలు, మార్గనిర్దేశకాలు అవుతాయి అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. మనమంతా కూడా కాల గమనంలో కొట్టుకుపోయే వాళ్లమే. ఆ కాలం ఎప్పుడు ఎవరికి ఎలా ఏ శిక్ష నిర్ణయిస్తుందో ఎవరూ చెప్పలేరు.
ఈ కరోనా లాక్డౌన్ సమయంలో మరణాలు పొందినవారి కుటుంబ సభ్యులకి ఈ శ్రీకృష్ణుడి అంత్యక్రియల ఘట్టం కొంతైనా భారాన్ని దింపుకునే శక్తిని ప్రసాదిస్తుందని ఆశిద్దాం.
సర్వే జనా సుఖినోభవంతు
You may like
Featured
YS Jagan: చంద్రబాబు నీ తల్లితండ్రులకు ఏనాడైనా కడుపునిండా భోజనం పెట్టావా: వైయస్ జగన్
Published
3 mins agoon
21 November 2024By
lakshanaYS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తాడేపల్లిలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పై ఈయన తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ముఖ్యంగా కొంతమంది ఐ టీడీపీ బ్యాచ్ తో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేసి తన తల్లి గురించి చెల్లి షర్మిల అలాగే తన పట్ల చేస్తున్నటువంటి పోస్టులపై ఈయన మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు తన ఐ టిడిపి బ్యాచ్ తో ఇలా ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయించి తన కుటుంబం గురించి ఎంతో అసభ్యకరంగా పోస్టులు చేయిస్తున్నారు. బాలకృష్ణ చేత తన చెల్లి పై తప్పుడు ప్రచారాలను కూడా చేయించారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నీకు కూడా ఓ కుటుంబం ఉంది కదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా తన తల్లిదండ్రులను ఈ రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయలేదు కనీసం వారిని ఒక్క పూటైనా నీ ఇంటికి పిలిచి కడుపునిండా భోజనం పెట్టవా మీ తల్లిదండ్రులు చనిపోతే వారికి తలకొరివి కూడా పెట్టలేదు అంటూ మండిపడ్డారు. ఇక అక్రమంగా సోషల్ మీడియా వైసిపి కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఇక వర్మ సెన్సార్ బోర్డు అనుమతి తీసుకుని సినిమా చేశారని ఈయన గుర్తు చేశారు.
YS Jagan: తలకొరివి పెట్టావా..
ఆయన సినిమా చేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఉంది. ఇప్పుడు తనపై కూడా కేసులు పెడుతున్నారని జగన్ గుర్తు చేశారు. కేవలం మీ టీడీపీ ఎల్లో బ్యాచ్ చేసినవే సినిమాలా అంటూ కూడా మండిపడ్డారు. ఇలా జగన్మోహన్ రెడ్డి సూపర్ సిక్స్ హామీల గురించి అలాగే తమ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న అప్పుల గురించి ఇక ప్రస్తుతం ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తల గురించి కూడా మండిపడుతూ చంద్రబాబు నాయుడు అలాగే కూటమి ప్రభుత్వానికి వరుస ప్రశ్నలు వేశారు.
Featured
Ambanti: హోం మంత్రి అనిత కులం పై అంబంటి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదంటూ?
Published
2 hours agoon
21 November 2024By
lakshanaAmbanti: ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కులం పట్ల మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను పరిగణలోకి తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అంబంటి రాంబాబు తెలిపారు. అనిత గారి కులం ఏంటి అనేది మాకు ఇప్పటివరకు తెలియదు.
ఈమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే తాను పక్కా క్రిస్టియన్ అని తెలిపారు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులో బైబిల్ ఉంటుంది అలాగే నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా బైబిల్ ఉంటుందని తెలిపారు.. ప్రస్తుతం హోం మంత్రిగా అధికారంలో ఉన్న తర్వాత ఈమె హిందువుగా చలామణి అవుతూ తిరుపతి ఆలయానికి కూడా వెళ్తున్నారని రాంబాబు తెలిపారు..
మరి ఈమె హిందువా క్రిస్టియనా అనే సంగతి మాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబంటి ఫైర్ అయ్యారు. పాపం హోమ్ మంత్రి చేతిలో ఏమీ ఉండదని అంత నారా లోకేష్ నడిపిస్తున్నారని ఈయన మండిపడ్డారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ అయ్యన్నపాత్రుడు అచ్చం నాయుడు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడటమే కాకుండా సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఈ విషయంపై మేము ఫిర్యాదులు కూడా చేశాము.
Ambanti:
ఇలా నారా లోకేష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈయన డిమాండ్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని… న్యాయపరంగా పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అంబంటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Featured
AP Politics: వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… ఇక వాలంటీర్లు లేనట్టేనా?
Published
22 hours agoon
20 November 2024By
lakshanaAP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమిచ్చి, ఆ ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని వాలంటీర్ సహాయం ద్వారా అందజేశారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
ఇలా వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా 5000 రూపాయలు చెల్లించారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పు పట్టారు. వాలంటీర్ ఉద్యోగం అంటే గోన సంచలు మోసే ఉద్యోగం అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూడా వాలంటీర్ వ్యవస్థ పై మండిపడ్డారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు తాజాగా శాసనమండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Politics: వాలంటీర్ వ్యవస్థ లేదు..
గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఈయన తెలిపారు. వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వైసిపి తమని నమ్ముకున్న ప్రజలు అలాగే కార్యకర్తలను పూర్తిగా మోసం చేసింది అంటూ బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదని తెలుస్తోంది.
YS Jagan: చంద్రబాబు నీ తల్లితండ్రులకు ఏనాడైనా కడుపునిండా భోజనం పెట్టావా: వైయస్ జగన్
Ambanti: హోం మంత్రి అనిత కులం పై అంబంటి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదంటూ?
AP Politics: వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… ఇక వాలంటీర్లు లేనట్టేనా?
Upasana: నా భర్త దర్గాకు వెళ్తే తప్పేంటి.. రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఉపాసన?
Revanth Reddy: కచ్చితంగా వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి వార్నింగ్ వారికేనా?
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured3 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?