Deepthi Sunaina: దీప్తి సునయన పరిచయం అవసరం లేని పేరు యూట్యూబర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె అనంతరం బిగ్ బాస్ కంటెస్టెంట్గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇలా ఎన్నో వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా దీప్తి చేసే పోస్టులు కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణమవుతూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని దీప్తి సునైనా తనకు వీలు కుదిరినప్పుడల్లా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు.
ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం తన కొత్త ఇంట్లోకి చేరాలని గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా నేటిజన్ దీప్తి సునయనను ప్రశ్నిస్తూ… కొత్త ఇల్లు కట్టావు అసలు అంత డబ్బు ఎలా వచ్చింది అంటూ ఈమెను ప్రశ్నించారు. ఇలా నేటిజన్ అడిగిన ప్రశ్నకు దీప్తి సునయన తన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.

Deepthi Sunaina: డబ్బు కూడా పెట్టి ఇల్లు కట్టాను…
తాను గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ ఛానల్ కోసం పనిచేస్తున్నానని అయితే అందులో వచ్చిన సంపాదనలో 70% కూడా పెట్టి 30% నా ఖర్చులు పెట్టుకున్నానని అలా కూడా పెట్టిన డబ్బుతోనే ఈ ఇంటిని కొన్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పిన సమాధానం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ఈమె డబ్బు కూడా పెట్టి ఇల్లు కట్టుకోవడం జరిగిందంటూ చెప్పడంతో చాలామంది ఈమె పై ప్రశంసలు కురిపిస్తున్నారు.