పన్నీరు తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

0
136

నాన్ వెజ్ కి ప్రత్యామ్నాయం పన్నీరు మాత్రమే.. ఈ విషయం వెజ్ తినే వాళ్లకి బాగా తెలుసు. అంతేకాదు పన్నీరులో మాంసాహారంలో ఉండే అనేక పోషకాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అటువంటి పన్నీరుతో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పన్నీరు మన గుండెకు చాలా మంచిది అంతేకాదు రక్తంలోని షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. పన్నీర్‌లో ఉండే మెగ్నీషియం క్యాటలిస్టులా పనిచేసి జీవ రసాయనిక చర్యల్ని ప్రోత్సహిస్తుంది. అంతేకాదు రొమ్ము క్యాన్సర్ బారినుంచి పన్నీర్ మనల్ని కాపాడుతుంది. పాల ఉత్పత్తి అయిన పన్నీర్‌లో ఉండే విటమిన్ డి, కాల్షియం, రొమ్ము కాన్సర్‌ను దరిచేరకుండా చేస్తాయి. పన్నీర్ మన శరీరంలోని వివిధ రకాల ఎంజైమ్‌లను యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో పన్నీర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ఫరస్, ఫాస్ఫేట్‌లు పన్నీర్ లో ఉండటంతో శరీరంలో జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. పన్నీర్ వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.

మనకు ప్రతితోజూ అవసరమయ్యే కాల్షియంలో 8 శాతం దీని ద్వారా లభిస్తుంది. దీని వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. పన్నీర్‌లో జింక్ ఉండటం వల్ల‌ రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మరియు షుగర్‌ని కంట్రోల్ చెయ్యడానికి దోహదపడుతుంది. అంతేకాదు ఇది టెన్షన్లను తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. గర్భిణీ మహిళలకు అత్యుత్తమైన ఆహారం పన్నీరు. సెలీనియం ఎక్కువగా ఉండే పన్నీరును వంటకాల్లో వాడటం వల్ల శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా పనిచేస్తాయి. అలాగే రేచీకటిని నిరోధిస్తుంది మరియు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆకలి లేకపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here