Super Star Krishna : సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తేనెమనసులు సినిమాతో తొలిసారిగా హీరోగా పరిచయమై దాదాపు నాలుగు దశాబ్దాల పైన సాగిన సినీ ప్రస్థానంలో దాదాపు 340 సినిమాలకు పైగా నటించారు. అంతేకాకుండా కృష్ణ నటించిన పలు సినిమాల ద్వారా కొత్త సాంకేతికతలను జోనర్లను పరిచయం చేశారు. తొలి జేమ్స్ బాండ్, తొలి కౌబాయ్, తొలి ఫుల్ స్కోప్ సినిమా, తొలి 70 ఎంఎం సినిమా లను కృష్ణ తన సినిమాల ద్వారా పరిచయం చేశారు.

ఇకపోతే జేమ్స్ బాండ్ సినిమాలకు సినీ అభిమానులు ఇప్పటికీ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. దీనికి ఉదాహరణ ఇటీవల వచ్చిన నో టైం టు డై. ఇది ఇండియాలో కూడా మంచి ఆదరణ పొందింది. అయితే ఇలాంటి జేమ్స్ బాండ్ కాన్సెప్ట్ను తొలిసారి టాలీవుడ్ కు పరిచయం చేశారు సూపర్ స్టార్ కృష్ణ. అయితే మొదటి సారి టాలీవుడ్ లో ఈ జేమ్స్ బాండ్ సినిమా తీయాలనే ఆలోచన 1964లో నిర్మాతలు సుందర్ లాల్ నహతా, డూండీ లది.

గూడచారిగా కృష్ణ సాహసం….
ఫ్రెంచ్ లో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా ఆధారంగా నిర్మాతలు ఆరుద్ర గారిని ఈ సినిమాకు స్క్రిప్ట్ రాసే బాధ్యతను అప్పగించారట. ఇక దర్శకత్వ బాధ్యతలను ఎం మల్లికార్జునరావు గారికి అప్పగించారు. అయితే కృష్ణ గారు సినిమా ప్రస్థానంలో ఇంకా మొదటి దశలోనే ఉన్నారు ఆయనకు ఇంకా ఇమేజ్ రాలేదు. అలాంటి సమయంలో ఇలాంటి సినిమా తీయడం అంటే ఒక సవాలుగానే చెప్పుకోవచ్చు. కానీ ఆయన ఈ సవాలును స్వీకరించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి కెమెరామెన్ కూడా ఇది ఒక సవాలుగానే ఉంటుంది. ఈ బాధ్యతలను విఎస్ఆర్ స్వామి స్వీకరించారు. చలపతి రావు గారు ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక కృష్ణ కు జోడీగా జయలలిత గారిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో శోభన్ బాబు గారు గా నటించడం విశేషం. రేలంగి-ముక్కామల-రావికొండలరావు- వెన్నిరాడై నిర్మల తదితరులు నటించారు.

ఇన్ని సాహసాలతో 1966 ఆగస్టు 11న ఒక కొత్త ట్రెండ్ ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ విజయం సాధించింది గూడచారి 116. ఈ సినిమా బ్లాక్ అండ్ వైట్ లో వచ్చినప్పటికీ సూపర్ స్టార్ కృష్ణ చేసిన యాక్షన్ సీన్లకు, తెర మీద చూపించిన సరికొత్త అద్భుతాలకు అభిమానులు ఫిదా అయ్యారు. తర్వాత వచ్చిన హీరోలలో చిరంజీవి సుమన్ లాంటి హీరోలు జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను ట్రై చేసినా కృష్ణ చేసిన గూడచారి 116 సినిమా మాత్రం తెలుగు సినీ అభిమానుల గుండెల్లో నిలిచి పోయింది.






























