Featured
అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే.. అందుకే కెరీర్ దెబ్బైపోయిందా..?
Published
3 years agoon
ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. దీంతో అనుపమకి మలయాళ సినిమా జేమ్స్ & అలైస్ లో అవకాశం దక్కింది. ఈ రెండు సినిమాల తరువాత తెలుగులో స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అ… ఆ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నితిన్ సమంత జంటగా నటించిన సినిమాలో అనుపమ సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేసింది. నెగిటివ్ టచ్ ఉన్న పాత్ర అయినా కూడా బాగానే ఆకట్టుకుంది.
అలాగే మలయాళం నుండి తెలుగులోనికి రీమేక్ చేసిన ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన నటించింది. దాంతో ఏకంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అనుపమకి అవకాశం ఇచ్చాడు. 2017 జనవరి నెలలో విడుదలైన శతమానం భవతి సినిమాలో శర్వానంద్‌తో జంటగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో తెలుగులో వరుసగా సినిమాలకి సైన్ చేసింది. తెలుగులో సినిమాలు చేస్తూనే ధనుష్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘కోడి’లో నటించింది. ఈ సినిమా అనుపమ మొదటి తమిళ సినిమా.
అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ మలయాళ సినిమా “జొమొంతె సువిశేషంగళ్” అనే సినిమాలోనూ నటించింది. ఇందులో మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. ఈ సినిమా తెలుగులో “అందమైన జీవితం” అనే పేరుతో డబ్ అయింది. ఇక 2017 అక్టోబరులో విడుదలైన ఉన్నది ఒకటే జిందగీ అనే సినిమాలో రామ్ పోతినేని సరసన నటించింది.
అలాగే నానితో కృష్ణార్జున యుద్ధం సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు యావరేజ్ అనే టాక్ దగ్గరే ఆగిపోయాయి. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై నిర్మించిన తేజ్ ఐ లవ్ యూ చేసి హిట్ అందుకుంది.
ఆ తర్వాత ఆమె హలో గురు ప్రేమకోసమే సినిమాలో మరోసారి రామ్ తో కలిసి నటించింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో మళ్ళీ తెలుగులో కనిపించలేదు. మధ్యలో ఓ సినిమాకి దర్శకత్వ శాఖలోనూ పనిచేసింది.
అయితే అనుపమ మంచి టాలెంటెడ్. పర్ఫార్మెన్స్ పరంగా వేలు పెట్టాల్సిన పనిలేదు. కానీ ఆమె గ్లామర్ రోల్స్చే యకుండా అన్నీ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూ రావడంతో గ్లామర్ రోల్స్ చేస్తూ స్టార్స్ గా వెలుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, సమంత, కాజల్ అగర్వాల్ లాంటి వాళ్లని తట్టుకొని నిలబడలేకపోయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలున్నాయి. అవి హిట్ అయితే మళ్ళీ ట్రాక్‌లోకి వస్తుందేమో చూడాలి.
అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే..
అనుపమ పరమేశ్వరన్‌లో ఉన్న మైనస్‌లు ఇవే..
You may like
Anupama parameswaran: డైరెక్టర్ ను అన్నయ్య అంటూ రాఖీ కట్టిన అనుపమ పరమేశ్వరన్?
Raviteja:అందమైన అమ్మాయిలు ఆపదం వాడకూడదు: రవితేజ
Keerthy Suresh: డైరెక్ట్ గా ఓటీటీ లోకి విడుదల కాబోతున్న స్టార్ హీరోయిన్ చిత్రం.. ఆ సినిమా ఏదో తెలుసా?
Anupama Parameswaran: ఆ అవకాశం మిస్ చేసుకుని ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను… అనుపమ కామెంట్స్ వైరల్!
Anupama Parameswaran: ఆరోజు ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.. అనుపమ కామెంట్స్ వైరల్!
Anupama Parameswaran: ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ అందరికీ షాక్ ఇచ్చిన అనుపమ… వైరల్ అవుతున్న పోస్ట్!
Featured
Ambanti: హోం మంత్రి అనిత కులం పై అంబంటి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదంటూ?
Published
56 mins agoon
21 November 2024By
lakshanaAmbanti: ప్రస్తుత హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత కులం పట్ల మాజీ మంత్రి అంబంటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మా పార్టీ కార్యకర్తలు చేసిన పోస్టులను పరిగణలోకి తీసుకొని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని అంబంటి రాంబాబు తెలిపారు. అనిత గారి కులం ఏంటి అనేది మాకు ఇప్పటివరకు తెలియదు.
ఈమె ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిజం చెప్పాలి అంటే తాను పక్కా క్రిస్టియన్ అని తెలిపారు. ఇప్పటికీ నేను ఎక్కడికి వెళ్ళినా నా కారులో బైబిల్ ఉంటుంది అలాగే నా హ్యాండ్ బ్యాగ్ లో కూడా బైబిల్ ఉంటుందని తెలిపారు.. ప్రస్తుతం హోం మంత్రిగా అధికారంలో ఉన్న తర్వాత ఈమె హిందువుగా చలామణి అవుతూ తిరుపతి ఆలయానికి కూడా వెళ్తున్నారని రాంబాబు తెలిపారు..
మరి ఈమె హిందువా క్రిస్టియనా అనే సంగతి మాకు ఇప్పటి వరకు క్లారిటీ లేదని తెలిపారు. తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టే సరికి ఆమె ఎస్సీ అయిపోయారని విమర్శించారు.ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే దుర్మార్గమైన పయత్నాలు చేస్తున్నారని అంబంటి ఫైర్ అయ్యారు. పాపం హోమ్ మంత్రి చేతిలో ఏమీ ఉండదని అంత నారా లోకేష్ నడిపిస్తున్నారని ఈయన మండిపడ్డారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి నారా లోకేష్ అయ్యన్నపాత్రుడు అచ్చం నాయుడు అందరూ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దుర్భాషలాడటమే కాకుండా సంచలనమైనటువంటి ట్వీట్ కూడా చేశారు ఈ విషయంపై మేము ఫిర్యాదులు కూడా చేశాము.
Ambanti:
ఇలా నారా లోకేష్ పై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు పోలీసులు చర్యలు తీసుకోలేదు ఎందుకని ప్రశ్నించారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని ఈయన డిమాండ్ చేశారు.వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని… న్యాయపరంగా పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని అంబంటి రాంబాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
Featured
AP Politics: వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… ఇక వాలంటీర్లు లేనట్టేనా?
Published
22 hours agoon
20 November 2024By
lakshanaAP Politics: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ని నియమిచ్చి, ఆ ఇంటికి అందాల్సిన ప్రభుత్వ పథకాలన్నింటిని వాలంటీర్ సహాయం ద్వారా అందజేశారు. ఇలా ప్రభుత్వ పథకాల అమలులో వాలంటీర్లు కీలక పాత్ర పోషించారని చెప్పాలి.
ఇలా వాలంటీర్లకు ప్రభుత్వం గౌరవ వేతనంగా 5000 రూపాయలు చెల్లించారు అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను అప్పట్లో ప్రతిపక్ష నేత ఆయన చంద్రబాబు నాయుడు పూర్తిగా తప్పు పట్టారు. వాలంటీర్ ఉద్యోగం అంటే గోన సంచలు మోసే ఉద్యోగం అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారని కూడా వాలంటీర్ వ్యవస్థ పై మండిపడ్డారు.
ఇలా వాలంటీర్ వ్యవస్థను వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తీరా ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వాలంటీర్ల గురించి ఎక్కడ ప్రస్తావనకు తీసుకురాలేదు తాజాగా శాసనమండలిలో మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ వ్యవస్థ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
AP Politics: వాలంటీర్ వ్యవస్థ లేదు..
గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తద్వారా 2023 సెప్టెంబర్ నుంచి వ్యవస్థలో లేని వారికి జీతాలు ఎలా చెల్లించాలని ఈయన తెలిపారు. వైసీపీ వారు వాలంటీర్లతో రాజీనామా చేయించారు. వైసిపి తమని నమ్ముకున్న ప్రజలు అలాగే కార్యకర్తలను పూర్తిగా మోసం చేసింది అంటూ బాల వీరాంజనేయులు చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి ఈయన మాటలను బట్టి చూస్తుంటే ఇక ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదని తెలుస్తోంది.
Featured
Upasana: నా భర్త దర్గాకు వెళ్తే తప్పేంటి.. రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఉపాసన?
Published
22 hours agoon
20 November 2024By
lakshanaUpasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల అయ్యప్ప మాల ధరించి కడప అమీన్ పీర్ దర్గాకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది హిందూ సంఘాలు అయ్యప్ప మాల ధరించి రామ్ చరణ్ దర్గాకు వెళ్లడాన్ని పూర్తిగా తప్పు పట్టారు.
దర్గా అంటే ఓ సమాధి ఇలా అయ్యప్ప మాల ధరించి సమాజ దగ్గరకు వెళ్లడం ఏంటి అంటూ ఈయన వ్యవహరి శైలిని పూర్తిస్థాయిలో విమర్శించారు. అయితే రామ్ చరణ్ దర్గాలో నిర్వహిస్తున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ విషయంలో రామ్ చరణ్ పట్ల వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి ఉపాసన ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ తన భర్తకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా ఉపాసనకు నెటిజన్ ఉపాసనని ట్యాగ్ చేస్తూ..మేడమ్ ఇతర మతాలను గౌరవించడం అంటే మీరు అయ్యప్ప మాలలోని వారి దర్గాకు వెళ్లడం కాదు. వారి విశ్వాసాన్ని అవమానించకుండా మరియు మన మతంలో జోక్యం చేసుకోకుండా వారు చేసే వాటిని గౌరవించడం ద్వారానే మతాన్ని గౌరవించుకోగలుగుతాం అంటూ ట్వీట్ చేసింది.
Upasana:వన్ నేషన్ వన్ స్పిరిట్..
ఇక ఈ పోస్టుకు ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా దర్గాలో చరణ్ దర్శించుకుంటున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ..విశ్వాసం ఏకం చేస్తుంది, అది ఎప్పటికీ విడిపోదు. భారతీయులుగా మనం దైవానికి సంబంధించిన అన్ని మార్గాలను గౌరవిస్తాము.. మన బలం ఐక్యతలోనే ఉంది. ఎల్లప్పుడూ రామ్ చరణ్ తన మతాన్ని అనుసరిస్తూనే ఇతర మతాలను గౌరవిస్తాడు.. వన్ నేషన్ వన్ స్పిరిట్.. జైహింద్ అంటూ చరణ్ దర్గాలో ఉన్న ఫోటోని షేర్ చేయడమే కాకుండా దర్గాకు వెళ్తే తప్పు లేదని కూడా ఈమె తన భర్తకు మద్దతుగా నిలిచారు.
Ambanti: హోం మంత్రి అనిత కులం పై అంబంటి సంచలన వ్యాఖ్యలు.. మాకు తెలియదంటూ?
AP Politics: వాలంటీర్లకు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్… ఇక వాలంటీర్లు లేనట్టేనా?
Upasana: నా భర్త దర్గాకు వెళ్తే తప్పేంటి.. రామ్ చరణ్ కు మద్దతుగా నిలిచిన ఉపాసన?
Revanth Reddy: కచ్చితంగా వారి చేత ఊచలు లెక్క పెట్టిస్తా.. రేవంత్ రెడ్డి వార్నింగ్ వారికేనా?
Vignesh Shivan: నయన్ తో విఘ్నేష్ ప్రేమ… కుక్కకు బిర్యాని దొరికిందంటూ ?
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured3 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!