JD Chakravarthy: జె.డి.చక్రవర్తి రీఎంట్రీ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన నటించిన దయ అనే వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4వ తేదీ నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చి ఎంత మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ముఖ్య అతిథిగా పాల్గొని అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ కొన్ని విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ తాను ఇలాంటి ఒక మంచి వెబ్ సిరీస్ లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ నాకు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే నాకు సవాళ్లు అంటే ఇష్టం.
ప్రతి పాత్రలోనూ నన్ను సవాల్ చేసుకోవడం తిరిగి ఆవిష్కరించుకోవడం చేస్తుంటాను ఈ వెబ్ సిరీస్ లో నాకు అది దక్కింది అంటూ ఈ సందర్భంగా జెడి చక్రవర్తి ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు..ఇక ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర పై ఉన్న సందేహాలు నేటిజన్స్ అడగడంతో వారి సందేహాలు అన్నింటిని తీర్చి అనంతరం వారితో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

JD Chakravarthy: నన్ను నేను ఆవిష్కరించుకోవడం ఇష్టం…
ఇక ఈ వెబ్ సిరీస్ లో ఇషా రెబ్బా, విష్ణు ప్రియ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు పవన్ సాదినేని దర్శకుడుగా వ్యవహరించారు.ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి బిజీగా ఉన్నారు.