JD Lakshminarayana : వందల ఏళ్ల నాటి చరిత్ర, రకరకాల జాతుల వారి సమ్మేళనం మన భాగ్య నగరం సొంతం. కాకతీయుల వైభవం తెలంగాణ నేలకు వన్నె తెస్తే, నైజాం కాలంలో కట్టిన కట్టడాలు సుందరం హైదరాబాద్ కు వన్నె తెచ్చాయి. ఓ వైపు చార్మినార్, మరోవైపు గోల్కొండ ఇలా ఎన్నో చారిత్రక కట్టడాల నడుమ అభివృద్ధి విషయంలో పరుగులు తీస్తూ ఉన్న హైదరాబాద్ ను ఏ ఒక్కరో అభివృద్ధి చేయలేదు. పాలించిన ప్రతి నాయకుడు అభివృద్ధిలో భాగం అయ్యారు. అలా నేడు విశ్వనగరంగా మారిన హైదరాబాద్ దేశ రాజధానిగా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయంటూ మాజీ ఈడీ జేడి లక్ష్మి నారాయణ తెలిపారు.

హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతోంది…
లక్ష్మి నారాయణ గారు మాట్లాడుతూ హైదరాబాద్ లో కేంద్రీయ సంస్థలు చాలా ఉన్నాయి. అలాగే రింగ్ రోడ్డులు మెట్రో వసతులు బాగా అభివృద్ధి చెందాయి. తాజాగా ఎయిర్ పోర్ట్ కి కూడా మెట్రో వసతులు కల్పించనున్నారు. ఇక రింగ్ రోడ్డుతో పాటు కొత్తగా మరో రింగ్ రోడ్డును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటూ చెప్పారు. ఇక ల్యాండ్ విషయంలో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల బాగా ఉండటం వల్ల ఏరియా అభివృద్ధికి ఆస్కారం ఉందని తెలిపారు. ఇక తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేస్తున్న 111 జీఓ వల్ల ఇప్పటివరకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పల్లెల భూములు వినియోగంలోకి వస్తాయి.

దానివల్ల కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అంటూ చెప్పారు. ఇప్పటివరకు పరిపాలించిన సీఎంలందరూ హైదరాబాద్ అభివృద్ధిని ఎక్కడా ఆపలేదు. అలాగే కెసిఆర్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తోంది అంటూ చెప్పారు. అయితే మునుపటి కంటే ఇప్పుడు మరిన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటూ చెప్పారు. హైదరాబాద్ ప్రస్తుతం దేశ రాజధాని అయితే చాలా బాగా ఉంటుందని అందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ చెప్పారు. ఢిల్లీ లో కాలుష్యం సమస్య అలాగే పాకిస్తాన్ దగ్గరగా ఉండటం వల్ల కూడా సమస్య ఉంది. కానీ దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్ రాజధానిగా అనువైన ప్రాంతం అంటూ చెప్పారు. భవిష్యత్తు లో ఇలాంటి ఒక ఆలోచన కూడా పాలకులు చేయవచ్చు అంటూ చెప్పారు.