Ashish Vidyarthi: ప్రస్తుత కాలంలో ప్రేమకు పెళ్లిళ్లకు వయసు ఏమాత్రం అడ్డు రావడం లేదు. ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు లేటు వయసులో ఘాటు ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి ఘటనలు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఇలా ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు వయసు మించిపోయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకుంటున్నటువంటి ఘటనలు తలెత్తుతున్నాయి.

తాజాగా మరొక నటుడు కూడా ఇలా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన నటుడు ఆశిష్ విద్యార్థి 60 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఈయన పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున ఈ ఫోటోలపై పలువురు నేటిజన్స్ స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదివరకే ఈయన వివాహం చేసుకొని ఓ కుమారుడికి కూడా జన్మనిచ్చారు. అయితే తన భార్యతో వచ్చిన విభేదాలు కారణంగా తనకు విడాకులు ఇచ్చారు. దీంతో కలకత్తాకు చెందిన ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ నడుపుతున్నటువంటి రూపాలి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నటువంటి ఈయన స్నేహితులు బంధువుల సమక్షంలో తనని వివాహం చేసుకున్నారు.

Ashish Vidyarthi: లేటు వయసులో ఘాటు ప్రేమలు…
ఇలా వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటోలపై స్పందిస్తూ ఇలా లేటు వయసులో ఘాటు ప్రేమలు ఏంటి బాసు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి కొందరు మీ టేస్టే వేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా మరికొందరు ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం అవసరమా అంటూ ఈయన పెళ్లి ఫోటోలు పై కామెంట్ చేస్తున్నారు.