Kalatapaswi K. Viswanath : తప్పు చేశాను… మానసికంగా చిత్రవధ అనుభవించాను…: కళాతపస్వి కే.విశ్వనాధ్

0
377

Kalatapaswi K. Viswanath : ఓ శంకరాభరణం, ఓ సాగర సంగమం, ఓ స్వర్ణ కమలం, ఓ సప్తపది ఇలా ఏ సినిమా తీసుకున్న అందులో ఒక సందేశం అలాగే భారతీయ సంస్కృతి ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా అవి జనాలను ఆకట్టుకునేలా తీసి కమర్షియల్ సినిమా హవా ఉన్న సమయంలో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు కే విశ్వనాధ్ గారు. ఆయన డైరెక్టర్ గా తీసిన మొదటి సినిమా ‘ఆత్మ గౌరవం’ కే నంది అవార్డు అందుకున్న అయన ఆ తరువాత అందుకున్న అవార్డులకు లెక్క లేదు. ఇప్పుడు ఆస్కార్ గురించి మాటలాడుతున్న చాలా మందికి తెలియని విషయం విశ్వనాధ్ గారి డైరెక్షన్లో వచ్చిన ‘సాగర సంగమం’ సినిమా 52వ ఆస్కార్ నామినేషన్స్ లో ఉత్తమ ఫారిన్ చిత్రంగా ఆఫీసియల్ ఎంట్రీ అందుకుంది. అంతే కాకుండా రష్యన్ లోకి విశ్వనాధ్ గారి ఎన్నో సినిమాలు డబ్ చేయబడ్డాయి. అలా చూసుకుంటే ఎన్నో అవార్డులు సత్కారాలు ఆయన సినిమాలకు లభించిన ఆయన 92 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 2 న వృధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో శివైక్యం చెందారు.

మానసికంగా చిత్ర వధ అనుభవించాను…

విశ్వనాధ్ గారు ఆయన చివరగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీసిన చిత్రాలు, పనిచేసిన నటినటుల గురించి మాట్లాడుతూ ‘సిరివెన్నెల’ సినిమా గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. సిరివెన్నెల సినిమాలో ఒక గుడ్డి వ్యక్తిని ఒక మూగ అమ్మాయి ప్రేమించడం కథాంశంగా ఉంటుంది. అలాంటి సబ్జెక్టు ఎందుకు తీసుకున్నానా అని ఆ సినిమా చేసే సమయంలో చాలా భయపడ్డానని, నేనే రచయితను కదా మార్గం సులువుగా ఉన్న కథ తీసుకుని ఉండవచ్చు.

ఎందుకు ఇలాంటి కథ తీసుకున్నాను అని ప్రతి రోజూ మధన పడ్డాను. ఒక గుడ్డివాడు మూగ అమ్మాయి మధ్య సంభాషణ ఎలా చూపించాలి అని మానసిక చిత్ర వధకు గురి అయ్యాను అంటూ విశ్వనాధ్ గారు తెలిపారు. అయన తీసిన చిత్రాల్లో ఈ సినిమా కోసం కష్టపడ్డానంటూ చెప్పిన ఆయన మాట్లాడు మరోసారి ఆయన మరణం తరువాత వైరల్ అవుతున్నాయి.