Mahesh Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే ముందుగా నటీనటులు యాక్టింగ్ స్కూల్ లో యాక్టింగ్ నేర్చుకోవడానికి శిక్షణ తీసుకుంటారు. ఈ క్రమంలోనే ప్రస్తుత కాలంలో చాలా మంది విదేశాలలో యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నారు. కానీ అప్పట్లో హీరోలు ఇక్కడే చాలామంది నటనలో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలో హీరోలుగా స్థిరపడ్డారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో యాక్టింగ్ కోచ్ గా సత్యానంద ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఈయన శిక్షణలో ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది శిక్షణ పొందిన వారు ఉన్నారు. అలాంటివారిలో మహేష్ బాబు ప్రభాస్ వంటి వాళ్లు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సత్యానంద మహేష్ బాబు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మహేష్ బాబుకు తానే యాక్టింగ్ నేర్పించానని అయితే తాను నటించిన మొదటి రాజకుమారుడు వంశి వంటి చిత్రాలకు డబ్బింగ్ చెప్పే సమయంలో తన పక్కనే ఉన్నానని వెల్లడించారు.మహేష్ బాబు కూడా డబ్బింగ్ చెప్పే సమయంలో తనని పక్కనే ఉండాలని కోరినట్లు సత్యానంద తెలిపారు.
తన పక్కనే ఉండమని చెప్పేవారు…
ఇక ఆయన మొదటి రెండు మూడు సినిమాలకు తన పక్కనే ఉండాలని కోరిన మహేష్ బాబు అనంతరం తనని తన పక్కన ఉండాలని కోరుకోలేదని ఇక అన్ని విషయాలలోనూ ముందుండి చూసుకునేవారు అంటూ సత్యానంద తెలిపారు. ఇక ఇప్పటికే మహేష్ బాబు ఎక్కడ కనపడిన అదే వినయతతో మాట్లాడతారని ఈ సందర్భంగా సత్యానంద మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.