Nagma: తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి వారిలో నటి నగ్మా ఒకరు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ఈమె తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేశారు. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి నగ్మా బాలీవుడ్ భోజ్ పురి కోలీవుడ్ ఇండస్ట్రీలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఈ విధంగా నగ్మా హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి సమయంలో ఈమె ఎంతో మంది హీరోలతో ఎఫైర్స్ పెట్టుకున్నారు అంటూ పెద్ద ఎత్తున ఈమె గురించి వార్తలు వచ్చాయి. ఇలా చాలామంది హీరోలతో నగ్మా రిలేషన్ లో ఉండడమే కాకుండా కొన్ని కారణాలవల్ల వారితో బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వచ్చాయి ఇలా బ్రేకప్ చెప్పుకున్నటువంటి ఈమె ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు.
ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి నగ్మా ప్రస్తుతం 48 సంవత్సరాల వయసులో తన పెళ్లి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు పెళ్లి చేసుకోవాలని ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అందరిలాగే తను పెళ్లి చేసుకుని పిల్లలతో ఓ కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాను కాలం కలిసి వస్తే అదే జరుగుతుందేమో వేచి చూడాలి అంటూ చెప్పుకొచ్చారు.

Nagma: నాకంటూ కుటుంబం కావాలని ఉంది…
సంతోషం అనేది ఒక దశలో మాత్రమే ఆగిపోకూడదని, నాకు పెళ్లి జరిగితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి నగ్మా మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెళ్లి గురించి ఈమె కామెంట్ చేయడంతో పెళ్లి చేసుకుని సమయంలో హీరోలతో రిలేషన్ లో ఉంటూ ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారా అంటూ కొందరు కామెంట్లు చేయగా మరి ఆ శుభవార్తను ఎప్పుడూ చెప్పబోతున్నారు అంటూ కూడా కొందరు కామెంట్ చేస్తున్నారు.