Neurologist Ranjith : ఇటీవల లోకేష్ పాదయాత్ర సందర్బంగా యువగళం ప్రోగ్రామ్ లో పాల్గొన్న నందమూరి తారకరత్న జనం ఎక్కువగా ఉండి అశ్వాస్తకు గురై అక్కడిక్కడే కుప్పకులాడు. వెంటనే లోకల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి చికిత్స అందించినా తారక రత్నకు గుండె పోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నారాయణ హృదయాలయకు తీసుకెళ్లారు. 45 నిమిషాల సేపు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందనే వార్తల నడుమ తాజాగా ఆయన బ్రెయిన్ కి డామేజ్ జరిగింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు బ్రెయిన్ కి డామేజ్ ఎంత శాతం జరుగుండొచ్చు మళ్ళీ సాధారణ స్థితికి తారకరత్న రాగలడా అనే అంశాలను ప్రముఖ న్యూరాలాజిస్ట్ రంజిత్ వివరించారు.

బ్రెయిన్ డామేజ్ వల్ల ఇతర సమస్యలు…
తారక రత్న గారికి సీపీఆర్ చేసే సమయానికి బ్రెయిన్ కి రక్తం సరఫరా ఆగిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక 5 నిముషాలు రక్తసరఫరా బ్రెయిన్ కి ఆగినా డామేజ్ జరుగుతుందని డాక్టర్ రంజిత్ వివరించారు. అయితే బ్రెయిన్ కి జరిగిన డామేజ్ తీవ్రతను బట్టి అతను కోలుకోగలడం లేదా అనే విషయం చెప్తారు అంటూ వివరించారు. రక్తం సరఫరా ఆగిపోవడంతో బ్రెయిన్ లోని కొన్ని ప్రాంతాల్లో డామేజ్ జరిగి వాపులాగ ఏర్పడుతుంది. ఒకవేళ వాపు ఎక్కువగా ఉండి డామేజ్ తక్కువగా ఉంటే అలాంటి పేషెంట్ త్వరగా కోలుకుంటాడు అయితే అలా కాకుండా ఎక్కువ శాతం బ్రెయిన్ డామేజ్ అయితే రోగి కోలుకోవడం కష్టం వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం ఉంచాల్సి వస్తుంది. దాని వల్ల కిడ్నీ పాడవడం వంటి సమస్యలు వస్తాయి.

తక్కువ బ్రెయిన్ డామేజ్ ఉండి పేషెంట్ వైద్యానికి రెస్పాండ్ అవుతున్నట్లయితే వెంటిలేటర్ మీద ఐదు నుండి ఏడు రోజుల వరకు ఉంచుతారు అంతకు మించి ఉంచాల్సిన అవసరం రాదు అంటూ తెలిపారు. అయితే ఒకవేళ డామేజ్ ఉండి అందుకు చికిత్స అందిస్తున్నా వెంటిలేటర్ మీద ఎక్కువ కాలం ఉంచడం వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, అలాగే కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం ఉంది అంటూ చెప్పారు. ఇక తారకరత్న విషయంలో ఒకవేళ బ్రెయిన్ డామేజ్ తక్కువగా ఉండి ఉంటే ఆయన కోలుకునే శాతం ఎక్కువగా ఉంటుందని మళ్ళీ సాధారణ జీవితం గడపవచ్చని తెలిపారు. అయితే తారకరత్న కు సంబంధిచిన రిపోర్ట్స్ బయటకు తెలియయదు కాబట్టి బ్రెయిన్ డామేజ్ ఎంత శాతం అయిందో తెలియదు కాబట్టి ఆయన కోలుకునే అవకాశం చెప్పలేమని తెలిపారు.