Featured
Paruchuri Gopalakrishna: అన్నయ్య కారణంగా 100 ఎకరాల ఆస్తులు పోగొట్టుకున్నా: పరుచూరి గోపాలకృష్ణ
Published
2 years agoon
By
lakshanaParuchuri Gopalakrishna: తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరుచూరి బ్రదర్స్ చేసినటువంటి సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పరుచూరి గోపాలకృష్ణ పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరు దాదాపు 300 సినిమాలకు కథలను అందించి ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు.అయితే వీరిద్దరూ రచయితలుగా మాత్రమే కాకుండా దర్శకులుగా నటులుగా కూడా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.
ఇక ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావుకి వయసు పై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు కానీ గోపాలకృష్ణ మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి విశ్లేషణ ఇస్తూ వీడియోలు చేస్తున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గోపాలకృష్ణ తాను ఆస్తులు కోల్పోవడం గురించి తెలియజేశారు.
శోభన్ బాబు హీరోగా తాను ఒక సినిమాకు దర్శకత్వం వహించానని తెలిపారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రామానాయుడు సురేష్ బాబు గారు ఈ సినిమా పక్క హిట్ అవుతుందని చెప్పారు. వారు చెప్పిన విధంగానే సినిమా చాలా మంచి సక్సెస్ అయింది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఇతర నిర్మాతలు తన వద్ద డబ్బులు కట్టలు ముందు పెట్టి తమ బ్యానర్లో సినిమా చేయాలని కోరారు.
Paruchuri Gopalakrishna నోట్ల కట్లు ముందున్న తీసుకోలేదు..
ఇలా నోట్ల కట్టలు నా ముందు ఉన్నప్పటికీ నేను వాటిని తీసుకోలేదు. అప్పటికి సురేష్ బాబు మీరు ఈ డబ్బు తీసుకోండి శంకరంపల్లిలో భూమి కొందామని చెప్పినప్పటికీ అన్నయ్య మాత్రం ఆ డబ్బు తీసుకోవడానికి ఒప్పుకోలేదు.వాడు దర్శకుడు అయితే నేను ఫిడేల్ వాయించుకోవాలా అంటూ మాట్లాడారు. అలా అన్నయ్యకు ఇష్టం లేకుండా నేను ఆ డబ్బును తీసుకోలేదు. ఆ రోజు కనుక ఆ డబ్బు తీసుకొని ఉంటే శంకరంపల్లిలో 100 ఎకరాల ఆస్తి నా సొంతం అయ్యేది. అప్పట్లో ఎకరం 10000 మాత్రమేనని ఈ సందర్భంగా గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
You may like
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులి… ఆయన కోరిక నెరవేరాలి… పరుచూరి కామెంట్స్ వైరల్!
Sarath Babu: శరత్ బాబుకి అది దేవుడిచ్చిన వరం… ఎమోషనల్ అయిన పరుచూరి గోపాలకృష్ణ!
Daggubati Rana: క్రిమినల్ కేసులో ఇరికిన దగ్గుబాటి రానా, సురేష్ బాబు.. కోర్టు నుంచి సమన్లు జారీ?
Suresh Babu: జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ క్లియర్ చేసిన ప్రొడ్యూసర్ సురేష్ బాబు… ఫిదా అవుతున్న నేటిజన్స్!
Suresh Babu -Samantha: సమంత మహానటి.. సమంత గురించి షాపింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు!
Paruchuri venkateswara Rao: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు.. వైరల్ అవుతున్న ఫోటో!
Featured
Allu Arjun: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!
Published
10 hours agoon
3 December 2024By
lakshanaAllu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమా డిసెంబర్ ఐదవ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలైన విషయం తెలిసిందే.
ఒక ఏపీలో మినహా అన్ని ప్రాంతాలలో కూడా బుకింగ్స్ మొదలయ్యాయి అయితే ఏపీలో టికెట్ల రేట్లు పెంచే విషయం గురించి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు కానీ ఇటీవల ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుతూ జీవో విడుదల చేస్తున్న దీంతో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం కానున్నాయి.
ఇలా టికెట్ల రేట్లు పెంచడమే కాకుండా అదనపు షోలకు కూడా అనుమతి లభించడంతో నటుడు అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెలిపిన ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Allu Arjun: ధన్యవాదాలు..
ఈ ప్రగతిశీల నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల శ్రేయస్సు పట్ల మీకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుంది. సినిమా ఇండస్ట్రీ మేలుకోసం ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే చిత్ర పరిశ్రమను బలోపేతం చేయటంలో ఆయన అమూల్యమైన మద్దతు తెలిపిన గౌరవనీయులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.
Featured
Pawan Kalyan: పవన్ పై ప్రశంసలు కురిపించిన పేర్ని నాని… సాహసం చేశారంటూ?
Published
10 hours agoon
3 December 2024By
lakshanaPawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ వైకాపా మంత్రి పేరుని నాని ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ ను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ ఇటీవల ప్రెస్ మీట్ కార్యక్రమంలో పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మీడియా సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ఇటీవల పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లి షిప్ సీజ్ చేసిన సంగతి తెలిసిందే
ఈ విషయం గురించి పేర్ని నాని మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి సంబంధించిన శాఖ కాకపోయినప్పటికీ తన ప్రాణాలకు తెగించి మరీ సముద్రంలోకి వెళ్లినందుకు తనని ప్రశంసిస్తున్నానని తెలిపారు..అనుభవమున్న రంగం కాబట్టి షిప్ చుట్టూ గిరగిరా తిరుగుతూ వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ ఈ పర్యటనలో భాగంగా రెండు నెలల నుంచి నాకు ఇక్కడకు రావడానికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తో పాటు కష్టమ్స్ ఆఫీసర్, పోర్ట్ ఆఫీసర్ ఇద్దరు కూడా బోర్డు లోనే ఉన్నారు మరి ఆయనకు ఎందుకు అనుమతి ఇవ్వలేదని ప్రశ్నించారు. ఒకటి చంద్రబాబు నాయుడు అయినా తనకు అనుమతి తెలపక పోవాలి లేదంటే పవన్ కళ్యాణ్ అయిన అబద్ధం చెప్పి ఉండాలని పేరుని నాని తెలిపారు.
ఇక పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అంటూ స్టెల్లా షిప్ నే ఎందుకు సీజ్ చేశారు సీజ్ ద షిప్ అని కెన్ స్టార్ షిప్ ను ఎందుకు అనలేదని, ఆ షిప్ దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు. ఆ షిప్ లో అక్రమంగా బియ్యం రవాణా జరిగి ఉండదా అంటూ ఈయన సరికొత్త సందేహాలను వ్యక్తపరిచారు.స్టెల్లా షిప్ ను 36 మంది ఎక్స్ పోర్టర్లు 35 వేల టన్నులు ఎక్స్ పోర్టు కోసం తెచ్చుకున్నారు. కెన్ స్టార్ షిప్ లో ఒకే ఎక్స్ పోర్టర్ 42 వేల టన్నుల బియ్యం ఎక్స్ పోర్టు చేస్తున్నారు.
Pawan Kalyan: పయ్యావుల కేశవ్..
మరి పవన్ కళ్యాణ్ ఎందుకని కెన్ స్టార్ షిప్ దగ్గరకు వెళ్లలేదు అంటూ ఈయన ప్రశ్నించారు ఎందుకంటే ఆ షిప్ స్వయానా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడు వేల్పూరి శ్రీనుకి సంబంధించినది కావటం విశేషం. అందుకనే పవన్ కళ్యాణ్ ఈ షిప్ వద్దకు వెళ్లలేదు అంటూ సరికొత్త సందేహాలను బయటపెట్టారు.
Featured
Mokshagna: మొదటి సినిమా పట్టాలే ఎక్కలేదు.. రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోక్షజ్ఞ?
Published
1 day agoon
2 December 2024By
lakshanaMokshagna: నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈయన చాలా ఆలస్యంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సరైన కథ డైరెక్టర్ తోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తోంది. హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకోలేదు అలాగే సినిమా ఇంకా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాలేదు కానీ ఈయన రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ వార్తలు వస్తున్నాయి. మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పూజ కార్యక్రమాలు డిసెంబర్ ఐదో తేదీ ఎంతో ఘనంగా జరగబోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం లేదు.
ఇలా డిసెంబర్ ఐదవ తేదీ పూజా కార్యక్రమాలను జరుపుకొని వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత మరో డైరెక్టర్ ను మోక్షజ్ఞ లైన్లో పెట్టారని తెలుస్తోంది. మరి ఆ డైరెక్టర్ ఎవరో అనే విషయానికొస్తే ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్షన్లో మోక్షజ్ఞ తన రెండో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
Mokshagna: వెంకీ అట్లూరి…
సార్ , లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న వెంకీ అట్లూరి నందమూరి హీరోతో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువబడలేదు మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాల్సిందే.
Allu Arjun: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు… అల్లు అర్జున్ పోస్ట్ వైరల్!
Pawan Kalyan: పవన్ పై ప్రశంసలు కురిపించిన పేర్ని నాని… సాహసం చేశారంటూ?
Mokshagna: మొదటి సినిమా పట్టాలే ఎక్కలేదు.. రెండో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోక్షజ్ఞ?
sobhita: పెళ్లికూతురు అయిన శోభిత… సంప్రదాయం ఉట్టి పడుతుందిగా!
Byreddy shabari: పుష్ప 2 పై టీడీపీ ఎంపీ షాకింగ్ పోస్ట్… కట్ చేస్తే పోస్ట్ డిలీట్.. ఏమైందంటే?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured4 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- devotional4 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
- Featured2 weeks ago
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
- Featured2 weeks ago
Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ తన సినిమా పోస్టర్లను అంటిస్తున్న రాకేష్..ఫోటోలు వైరల్!
- Featured1 week ago
Prabhas Fans: ప్రభాస్ ఎవడు నీకు తెలియదా.. గతాన్ని తవ్వి మరి షర్మిలకు కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్?
- Featured4 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?