Pawan Kalyan: పవన్ కళ్యాణ్ షూస్ 10 లక్షలా.. ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్.. అసలేమైందంటే?

0
137

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత హరిహర వీరమల్లు ఫ్రీ షెడ్యూల్ వర్క్ షాప్ కోసం హాజరు అయ్యారు. అయితే ఈ వర్క్ షాప్ కోసం పవన్ కళ్యాణ్ మాసి లుక్ లో సందడి చేయడంతో పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఇలాంటి లుక్ చూసి చాలా కాలం అయిందని ఇలాంటి లుక్ లో ఒక సినిమా తప్పకుండా తీయాలంటూ అభిమానులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ వర్క్ షాప్ కి పవన్ కళ్యాణ్ హాజరు కాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ ధరించిన షూస్, వాచ్ పై అభిమానుల కన్ను పడింది. ఇంకేముంది వీటి ధర ఎంత అంటూ పెద్ద ఎత్తున ఆరా తీస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ధరించిన షూస్ 10 లక్షలు వాచ్ 14 లక్షలు అని తెలియడంతో పెద్ద ఎత్తున యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కు అప్పులు ఉన్నాయని ఆయన ప్రతినెలా EMI కట్టుకున్నారంటూ గతంలో మెగా బ్రదర్స్ నాగబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఇలా EMI కట్టుకునే పవన్ కళ్యాణ్ ఇంత కాస్ట్లీ వస్తువులు ఉపయోగిస్తున్నారు అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పవన్ అభిమానులు ఈ షూస్ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Pawan Kalyan: అసలు ధర ఇదే..

పవన్ కళ్యాణ్ ధరించిన ఆ షూస్ 119 యూరోలు అంట. అయితే ఆ వెబ్‌సైట్‌లో 119,94 అని చూపిస్తుంది. కానీ యూరోలను లెక్కేసే సమయంలో ఫులి స్టాప్ ను కామాగా చూపిస్తారు.అయితే ఈ విషయం పట్టించుకోకుండా ఏకంగా పవన్ కళ్యాణ్ షూస్ 10 లక్షల అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. నిజానికి ఈయన షూస్ ధర 9600 అంటూ అభిమానులు ట్రోలర్స్ కు భారీగా కౌంటర్ ఇచ్చారు.