Perni Nani : ఏపీ రాజకీయాల్లో టీడీపీ మీద ఎంత ఎత్తున వైసీపీ నేతలు లేస్తారో తెలియదు కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాత్రం వైసీపీ నేతల విసుర్లు బాగా ఉంటాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టినా లేక బహిరంగ సభ పెట్టినా ఆయన మాట్లాడిన విషయాలకు కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ లో కొంతంది లీడర్స్ రెడీగా ఉంటారు. అందులో ముందుండేది పేర్ని నాని. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పేర్ని నాని జనసేన అధినేత మీద బాగా ఫైర్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ మీద ఒక్క ఛాన్స్ కూడా వదలకుండా అలా విమర్శలు చేయడమే పని అన్నట్లు చేసే పేర్ని నాని గారు అదే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురవగా ఆసక్తికర సమాధానం చెప్పారు.

పవన్ పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదు…
పవన్ కళ్యాణ్ గురించి విమర్శించాలంటే ఆయన మూడు పెళ్లిళ్ల వ్యవహారం గురించే మాట్లాడుతారు వైసీపీ వాళ్ళు. అయితే పేర్ని నాని మాత్రం నేనసలు పవన్ ను ఏనాడూ వ్యక్తిగతంగా విమర్శించలేదు. జగన్ గారిని పవన్ విమర్శించిన వాటికి అలానే ఆయన చేసే అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజల ముందు నిలబెట్టాను కానీ ఆయన మీద ఆయన పెళ్లిళ్ల మీద విమర్శలు చేయలేదంటూ చెప్పారు పేర్ని నాని.

కావాలంటే 2019 నుండి మీడియా రికార్డింగ్స్ పరిశీలించండి అంటూ సవాల్ చేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ అంతకు ముందు తెలియదు, 2019 తరువాత నుండి జగన్ ను విమర్శించడం మొదలు పెట్టాడు అప్పటి నుండే నేను విమర్శించాను కానీ ఆయన పెళ్లిళ్ల గురించి మాట్లాడలేదు. ఒకరిని వ్యక్తిగతంగా ఏనాడూ దిగజార్చి మాట్లాడను అంటూ పేర్ని నాని వివరణ ఇచ్చారు.